ETV Bharat / state

Kishan Reddy Latest News : కిషన్​రెడ్డికి అరుదైన ఆహ్వానం.. తొలి భారత పర్యాటక శాఖ మంత్రిగా..

Kishan Reddy Speech in United Nations : ఐక్యరాజ్య సమితిలో జరగనున్న అంతర్జాతీయ సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ ​రెడ్డి ప్రధాన వక్తగా ప్రసంగించనున్నారు. ఈ అరుదైన ఘనతను సాధించిన తొలి భారత పర్యాటక శాఖ మంత్రిగా ఆయన రికార్డు సృష్టించారు. ప్రపంచ దేశాల నుంచి వచ్చిన ప్రముఖులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు.

Kishan Reddy
Kishan Reddy
author img

By

Published : Jun 30, 2023, 5:14 PM IST

Kishan Reddy Will Speech On United Nations In NewYark : కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డికి అరుదైన ఆహ్వానం లభించింది. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం వేదికగా జరగనున్న అంతర్జాతీయ సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాన వక్తగా ప్రసంగించే అవకాశం కిషన్ రెడ్డికి లభించింది. ఇప్పటి వరకు ఈ అవకాశం లభించిన తొలి భారత పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి కావడం గమనార్హం. ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యాటక సంస్థ ఆధ్వర్యంలో.. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం వేదికగా జరగనున్న ప్రపంచ ‘హై లెవల్ పొలిటికల్ ఫోరమ్ సమావేశాల్లో కిషన్ రెడ్డి ప్రపంచంలోని వివిధ దేశాల ప్రజా ప్రతినిధులు, అంతర్జాతీయ ప్రముఖ పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

Kishan Reddy Received Call From United Nations : భారతదేశం జీ-20 సమావేశాలను నిర్వహిస్తున్న నేపథ్యంలో.. కేంద్ర పర్యాటక మంత్రిగా, ‘జీ-20 దేశాల టూరిజం చైర్‌’ హోదాలో కిషన్ రెడ్డి ఈ అంతర్జాతీయ సమావేశాల్లో పాల్గొననున్నారు. ఇటీవలే గోవాలో జరిగిన జీ-20 దేశాల పర్యాటక మంత్రులు, 9 ప్రత్యేక ఆహ్వానిత దేశాల మంత్రుల సమావేశాలు విజయవంతంగా జరగడం, ఈ సందర్భంగా భారతదేశం చేసిన ప్రతిపాదనలకు సభ్యదేశాలు, ఆతిథ్య దేశాల మంత్రులు ఏకగ్రీవంగా ఆమోదించిన సంగతి తెలిసిందే.

Kishan Reddy Speech At High Level Political Forum Meetings : ఈ నేపథ్యంలో ‘పర్యాటక రంగంలో సుస్థిరాభివృద్ధి లక్షాలను చేరుకోవడం, అత్యవసర కార్యాచరణ కోసం ప్రపంచ దేశాలను, వివిధ భాగస్వామ్య పక్షాలను (వ్యాపార సంస్థలు) ఏకం చేయాల్సిన ఆవశ్యకత’ ఇతివృత్తం (థీమ్)తో జులై 13, 14 తేదీల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి. వివిధ దేశాల ఆర్థికాభివృద్ధిలో పర్యాటక రంగం కీలక పోషిస్తోంది. నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత.. భారతదేశ ప్రతిష్ఠ దశదిశలా వ్యాపించిందని కిషన్​ రెడ్డి పేర్కొన్నారు.

Kishan Reddy Fires on CM KCR : 'కేసీఆర్‌.. రైతులను వదిలేసి రాజకీయ పార్టీలకు నిధులిస్తున్నారు'

దేశంలో తొలిసారిగా హైదరాబాద్​కు ఔటర్​ రింగ్​ రైలు ప్రాజెక్టు : హైదరాబాద్​లోని రీజనల్​ రింగ్​ రోడ్డుకు సమాంతరంగా ఔటర్​ రింగ్​ రైలు ప్రాజెక్టు రానుందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్​ రెడ్డి రెండు రోజుల క్రితం వెల్లడించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం సర్వే చేసేందుకు.. కేంద్ర ప్రభుత్వం రూ.14 కోట్లను కేటాయించిందని తెలిపారు. రింగ్​ రైలు ప్రాజెక్టుపై ఇప్పటికే రైల్వే శాఖ కసరత్తు ప్రారంభించి.. 99 శాతం కొలిక్కి వచ్చేలా చూసిందన్నారు. ఈ వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి త్వరలో అందించనున్నామని తెలిపారు. ఈ రైలు ప్రాజెక్టు ఏపీ, తెలంగాణ, మహారాష్ట్రకు వెళ్లే రైల్వే లైన్లకు ఔటర్​ రింగ్​ రైల్​ ప్రాజెక్టు ఉపయోగపడుతుంది. దీనివల్ల సిటీ సరిహద్దుల నుంచే గమ్యస్థానాలకు వెళ్లవచ్చు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.