బంసిలాల్ పేట్, పద్మారావు నగర్‌కు చెందిన వంద మందికి పైగా కార్యకర్తలు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి సమక్షంలో భాజపాలో చేరారు. ఈ సందర్భంగా భాజపా అతి పెద్ద కుటుంబమని కిషన్‌రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇందులో సభ్యులుగా చేరిన వారందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.
గతంలో చైనా కమ్యూనిస్టు పార్టీ అతిపెద్ద పార్టీగా ఉండేదని.. ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య పార్టీగా భాజపా అవతరించిందని ఆయన పేర్కొన్నారు. భాజపా బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. పుల్వామా దాడిలో అమరులైన జవాన్లకు నివాళులు అర్పించి వారి సేవలను గుర్తు చేసుకున్నారు.
పద్మారావు నగర్‌లోని స్వరాజ్ ప్రెస్ భవన్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు మోత్కుపల్లి నర్సింహులు, మహంకాళి జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్ గౌడ్, సహా పలువురు నాయకులు హాజరయ్యారు.
ఇదీ చూడండి : తెలంగాణ పల్లె అందాలకు బ్రిటిష్ కమిషనర్ ఫిదా