ETV Bharat / state

'ఉపాధి అవకాశాల వృద్ధితో ఆర్థికవ్యవస్థ బలోపేతం' - kishan reddy press meet

ద్రవ్యోల్బణాన్ని మూడుశాతానికి కట్టడి చేసేలా కేంద్రప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఉపాధి అవకాశాలు వృద్ధి చెందితేనే ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని ఆయన తెలిపారు.

'ఉపాధి అవకాశాలు మెరుగైతేనే ఆర్థిక వ్యవస్థ బలేపేతం'
author img

By

Published : Sep 26, 2019, 6:11 PM IST

'ఉపాధి అవకాశాలు మెరుగైతేనే ఆర్థిక వ్యవస్థ బలేపేతం'

ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం కొనసాగుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అగ్రరాజ్యాలైన అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం జరుగుతోందని తెలిపారు. చాలా దేశాల్లో ఆర్థిక సంక్షోభం ఏర్పడిందని చెప్పారు. దేశంలో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి కేంద్రం పెట్టుబడులు ఆహ్వానిస్తోందని తెలిపారు. మేకిన్ ఇండియాకు ఊతమిచ్చేలా రూ.70 వేల కోట్లు మూలధనంగా బ్యాంకులకు అందించినట్లు వివరించారు. ద్రవ్యోల్బణం 3శాతానికి కట్టడి చేసేలా కేంద్రప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు కిషన్​రెడ్డి వెల్లడించారు.

ఇవీచూడండి: 'ఉగ్రవాదాన్ని ఆయుధంగా మలుచుకుంటున్న పాక్​'

TG_Hyd_22_26_ Sarpanche's Naminations On Huzur Nagar Election_Ab_TS10005_R Note: Feed Etv Bharat Contributor: Bhushanam *ప్రభుత్వ వైఖరికి నిరసనగా హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో తెలంగాణ సర్పంచ్ ల పోటీ* ( ) రానున్న హుజూర్ నగర్ నియోజకవర్గ ఉపఎన్నికలో తెలంగాణ సర్పంచుల సంఘం అభ్యర్థులను పోటీలో నిలుపుతున్నట్లు సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సౌదని భూమన్న యాదవ్ తెలిపారు. ఈ నెల 29 , 30న హలో సర్పంచ్ ఛలో హుజూర్ నగర్ పేరుతో 251 మంది సర్పంచులు నామినేషన్లు దాఖలు చేయక్నున్నట్లు వెల్లడించారు. తెరాస ప్రభుత్వం సర్పంచులపై వ్యవహరిస్తున్న వ్యతిరేక విధానాలకు నిరసనగా... హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో తమ సత్తాచాటడానికి పోటీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఉప సర్పంచ్ లకు జాయింట్ చెక్కు పవర్ ను రద్దుచేయాలని...73వ రాజ్యాంగ సవరణ ద్వారా సంక్రమించిన 29 అంశాలను స్థానిక సంస్థలకు బదిలీ చేయాలని ఆగస్టు 3న ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి విన్నవించామన్నారు. దీనికి సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి ఇంతవరకు అమలు చేయలేదని ఆయన మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం 14వ ఆర్థిక సంఘం కేటాయించిన నిధులను నేరుగా గ్రామపంచాయితీలకు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు . హుజూర్ నగర్ లో నామినేషన్లు దాఖలు చేసిన తర్వాత గ్రామ గ్రామానికి తిరిగి విస్తృతంగా ప్రచారం నిర్వహించి... తెరాస అభ్యర్థి ని ఓడించి సర్పంచ్ ల సత్తా ఏమిటో చూపిస్తామని ఆయన తెలిపారు. బైట్ : సౌదని భూమన్న యాదవ్ ( తెలంగాణ సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు )
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.