కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు లేఖ రాశారు. హైదరాబాద్ అంబర్పేట ప్రధాన కూడలి నుంచి నిర్మించే నాలుగు లైన్ల వంతెన నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.
202 జాతీయ రహదారిపై అంబర్పేట క్రాస్ రోడ్డు వద్దనున్న వంతెన నిర్మాణానికి రెండు సంవత్సరాల కింద కేంద్ర హోంశాఖ మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. జీహెచ్ఎంసీ స్థల సేకరణను త్వరగా పూర్తి చేసి పైవంతెనను నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.
![kishan reddy letter to cm kcr about building bridge](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg_hyd_26_03_kishanreddy_letter_to_kcr_av_3182061_0306digital_1591168734_654.jpg)