గంగపుత్రులకు తమ వృత్తి అయిన చేపలు పట్టేందుకు కేంద్రం అండదండలు అందిస్తుందని కేంద్ర హోం శాఖ సహయక మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ గోల్నాకలోని తిలక్ నగరలో నూతనంగా నిర్మించిన గంగపుత్ర సంఘం గంగా గౌరీ భజన మండలి సభా భవనాన్ని ఆయన ప్రారంభించారు. 57 ఏళ్లుగా ప్రజల్లో ఆధ్యాత్మికతను పెంపొందిస్తున్న భజన మండలి నమావేశాల కోసం ఒక భవనాన్ని ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందని గంగా గౌరీ భజన మండలి వ్యవస్థాపక అధ్యక్షుడు నరసింహ బెస్త తెలిపారు. సదరు భవనాన్ని ప్రారంభించిన మంత్రి కిషన్‌రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఇంతకాలంగా అన్నదమ్ముల్లా ఉన్న గంగపుత్రులు, ముదిరాజుల మధ్య రాష్ట్రప్రభుత్వ విధానాల వల్ల అభిప్రాయబేధాలు తలెత్తుతున్నాయని నరసింహ బెస్త అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మత్స్యకారుల సంక్షేమం కోసం బడ్జెట్లో నిధులు కేటాయించిందని తెలిపారు. సముద్రంలో వేటకు వెళ్లినవారు ఒట్టి చేతులతో తిరిగిరాకూడదనే ఉద్దేశంతో చేపల లభ్యత ఎక్కడుందో తెలిపేందుకు చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. గంగపుత్రులకు ఆధునిక బోట్లు, వలల కొనుగోలు కోసం బ్యాంకుల ద్వారా రుణాలు అందించడానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని చెప్పారు.
ఇదీ చదవండి: వెంకటేశ్వర ఆలయంలో ముస్లింల పూజలు