ETV Bharat / state

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్‌ పోటీ పడి డబ్బులు వెదజల్లాయి : కిషన్‌రెడ్డి - Kishan Reddy Latest News

Kishan Reddy fires on Congress and BRS : రాష్ట్రంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో హస్తం పార్టీ, బీఆర్ఎస్ పోటీ పడి డబ్బులు పంచారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. కర్ణాటక నుంచి డబ్బు తీసుకువచ్చి, కాంగ్రెస్ తెలంగాణలో పంచిందని ఆయన ధ్వజమెత్తారు.

KISHAN REDDY
KISHAN REDDY
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 10, 2023, 3:08 PM IST

Kishan Reddy Fires on Congress and BRS : తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్‌ పోటీ పడి డబ్బులు వెదజల్లారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి (Kishan Reddy) ఆరోపించారు. కర్ణాటక నుంచి డబ్బు తీసుకువచ్చి, హస్తం పార్టీ రాష్ట్రంలో పంచిందని విమర్శించారు. కర్ణాటకలో అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడవక ముందే అక్కడి ప్రభుత్వం దోపిడీ చేస్తోందని, ఆ రాష్ట్ర బడ్జెట్ అంతా గ్యారెంటీలకే పోతుందని అన్నారు. హైదరాబాద్‌ బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ పార్టీకి అవినీతికి విడదీయలేని బంధం ఉందని కిషన్‌రెడ్డి ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోదీకి దేశ ప్రజలు మూడోసారి పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు ఇంటి, వ్యాపార సముదాయాల పైన జరిగిన ఐటీ సోదాల్లో రూ.290 కోట్ల అక్రమ సంపాదనను అధికారులు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు.

తెలంగాణలో ఓటింగ్ శాతం పెరిగిన ఏకైక పార్టీ బీజేపీ : కిషన్‌రెడ్డి

ఈ ఖ్యాతి కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది : దేశ చరిత్రలో ఆదాయ పన్ను అధికారుల దాడుల్లో ఒకే చోట ఇంత పెద్ద అక్రమ సంపాదన బయట పడటం తొలిసారని కిషన్‌రెడ్డి అన్నారు. ఈ ఖ్యాతి కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. డబ్బులు లెక్కించే యంత్రాలు వేడెక్కి మొరాయిస్తున్నాయి తప్పితే, లెక్కించడం పూర్తికావడం లేదని చెప్పారు. రాంచీలోని 8 బ్యాంకుల్లో లాకర్స్ ఉన్నట్లు గుర్తించిన ఆదాయ పన్ను శాఖ అధికారులు సీజ్ చేశారని తెలిపారు. దీనిని బట్టి హస్తం పార్టీ అవినీతి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు. రాహుల్ గాంధీకి అత్యంత నమ్మకమైన, సన్నిహితమైన అనుచరుడు ధీరజ్ సాహు అని కిషన్‌రెడ్డి అన్నారు.

రాహుల్ గాంధీ (Rahul Gandhi) భారత్ జోడో యాత్రకు అన్ని ఏర్పాట్లు చేసింది ధీరజ్ సాహు అని కిషన్‌రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ నాయకులపై ఐటీ దాడులు జరిగితే రాహుల్ గాంధీ కేంద్రాన్ని విమర్శిస్తారని, కానీ ధీరజ్ సాహు అక్రమ సంపాదనపై ఆయన ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఆ డబ్బు ఎవరిదో రాహుల్ గాంధీ చెప్పాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల కోసం కూడబెడుతున్న నోట్ల గుట్టలా? అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

Kishan Reddy on ORR Lease : 'ఓఆర్‌ఆర్‌.. భవిష్యత్తులో కేసీఆర్‌కు ఏటీఎం'

"ఓడిపోయిన వ్యక్తికి మూడు సార్లు కాంగ్రెస్ పార్టీ రాజ్యసభకు పంపింది. యూపీఏ హయాంలో రూ.12 లక్షల కోట్ల అవినీతి జరిగింది. ప్రతి రోజు కాంగ్రెస్ కుంభకోణాలే కనిపించాయి. 2జీ, బొగ్గు వంటి అనేక కుంభకోణాలు జరిగాయి. కాంగ్రెస్ వ్యక్తులు తీహార్ జైల్లో ఉన్న పరిస్థితి. తొమ్మిదిన్నరేళ్లుగా నీతివంతమైన పాలన అందిస్తోంది నరేంద్ర మోదీ ప్రభుత్వం. దేశానికి ఇస్తున్న గ్యారెంటీ, మోదీ గ్యారెంటీ. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న చోట అవినీతి మూడు పువ్వులు, ఆరు కాయలుగా వెల్లివిరిస్తోంది." - కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్‌ పోటీ పడి డబ్బులు వెదజల్లాయి కిషన్‌రెడ్డి

ఎస్సీ వర్గీకరణ ఆలస్యంలో మొదటి ముద్దాయి కాంగ్రెస్‌ పార్టీ : కిషన్‌రెడ్డి

Kishan Reddy Fires on Congress and BRS : 'కాంగ్రెస్‌ విజయభేరి బహిరంగ సభ.. బీఆర్‌ఎస్‌ స్పాన్సర్‌ చేసినట్లుగా ఉంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.