ETV Bharat / state

Kishan Reddy Fires On CM KCR : 'ఎన్నికల హామీలను అమలు చేయటంలో కేసీఆర్ విఫలమయ్యారు' - కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా

Kishan Reddy Fires On CM KCR : కేంద్ర నిధుల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డి అన్నారు. తొమ్మిదేళ్ల కాలంలో కేసీఆర్ సర్కార్ ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ఎన్నికల హామీలను అమలు చేయటంలో కేసీఆర్ విఫలమయ్యారని వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇంఛార్జిల సమావేశం ప్రారంభించిన కిషన్ రెడ్డి.. కేసీఆర్ పాలనపై విరుచుకుపడ్డారు.

Kishan Reddy
Kishan Reddy Fires On CM KCR
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 8, 2023, 5:26 PM IST

Updated : Sep 8, 2023, 7:23 PM IST

Kishan Reddy Fires On CM KCR ఎన్నికల హామీలను అమలు చేయటంలో కేసీఆర్ విఫలమయ్యారు

Kishan Reddy Fires On CM KCR : బీజేపీ రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇంఛార్జిల సమావేశం ప్రారంభమైంది. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్​రెడ్డి (Kishan Reddy) అధ్యక్షతన జరుగుతున్న సమావేశానికి సునిల్ బన్సల్, ప్రకాశ్​ జవడేకర్, డీకే అరుణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇంఛార్జిలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు పాల్గొన్నారు.

Telangana BJP State Office Bearers Meeting : మేరీ మాటీ-మేరా దేశ్ కార్యక్రమ(BJP Meri Mati Mera Desh Program) యోజన, ఎమ్మెల్యే ప్రవాస్ యోజన అసెంబ్లీ వారీగా ఏ విధంగా జరిగిందనే దానిపై నేతలు సమీక్షిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వ్​డ్ అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నిర్వహించిన సమ్మేళనాలపై సమీక్ష నిర్వహించాల్సిన వాటిపై చర్చిస్తున్నారు. జిల్లా, అసెంబ్లీ వారీగా సంస్థాగత పరిశీలకుల పర్యటనకు చేయవలసిన ఏర్పాట్లు.. అలాగే అసెంబ్లీ ఎన్నికల(Telangana Assembly Elections 2023) తయారీపై సమీక్ష చేస్తున్నారు. త్వరలో జరిగే పార్టీ యాత్రల ఏర్పాట్లపైన అభిప్రాయాలు, సలహాలు, సూచనలు స్వీకరిస్తున్నారు.

Amit Shah Telangana Tour : సెప్టెంబర్ 17న తెలంగాణకు అమిత్ షా

Kishan Reddy Comments On CM KCR : మోదీ జన్మదినమైన సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు 15 రోజుల సేవాపక్షం సందర్భంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలపై, ఆయుష్మాన్ భారత్ కార్డు జారీపై దిశానిర్దేశం చేస్తున్నారు. సెప్టెంబర్ 17న విశ్వకర్మ జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 18 కులవృత్తి వారికి లబ్ధి చేకూర్చే పథకం గురించి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే అంశాలపై దిశానిర్దేశం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం(Telangana Liberation Day) సందర్భంగా చేయాల్సిన కార్యక్రమాలు, తెలంగాణ విమోచన దినోత్సవంకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) వస్తున్న నేపథ్యంలో పర్యటన విజయవంతంపై మార్గ నిర్దేశనం చేస్తున్నారు.

kishan Reddy Comments on BRS : 'వంట గ్యాస్​, పెట్రో రేట్ల​పై మాట్లాడే నైతిక హక్కు బీఆర్​ఎస్​కు లేదు'

BJP Executive Meeting Chaired by Kishan Reddy : చంద్రయాన్-3, ఆదిత్య ఎల్-1 విజయవంతంపై శాస్త్రవేత్తలను, ప్రధానమంత్రి మోదీని అభినందిస్తూ గ్రామ పంచాయితీలు, మండల పరిషత్, మున్సిపాలిటీలచే తీర్మానం చేయించడం, ఓటర్ జాబితా వెరిఫికేషన్, భవిష్యత్ కార్యక్రమాలపై సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో ఎన్నికల కమిటీ, మేనిఫెస్టో కమిటీ, ఛార్జ్ షీట్ కమిటీల ఏర్పాట్లపై కూడా చర్చలు జరుగుతున్నాయి.

కేంద్ర నిధుల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డి(Telangana BJP President Kishan Reddy) అన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తొమ్మిదేళ్ల కాలంలో కేసీఆర్ సర్కార్ ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని పార్టీ రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇంఛార్జిల సమావేశంలో కిషన్​రెడ్డి ఆరోపించారు. ఎన్నికల హామీలను అమలు చేయటంలో కేసీఆర్ విఫలమయ్యారని తెలిపారు. పోటీ పరీక్షలను కూడా నిర్వహించలేని అసమర్థ ప్రభుత్వం.. కేసీఆర్ సర్కార్ అని వ్యాఖ్యానించారు.

సెప్టెంబర్ 17ను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా కేంద్రం నిర్వహిస్తోందని.. ఈ వేడుకలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా.. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. వివిధ రూపాల్లో రూ.27 లక్షల కోట్లు తెలంగాణకు ఇప్పటివరకు కేంద్రం ఇచ్చిందని స్పష్టం చేశారు. రెండు పడక గదుల ఇళ్లు(Double Bedroom Houses), పెన్షన్లపై కేసీఆర్ ఇచ్చిన మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Kishan Reddy Fires on CM KCR : కాంగ్రెస్​ కమీషన్ల ప్రభుత్వం అయితే.. బీఆర్​ఎస్​ వాటాల సర్కార్​ అయింది: కిషన్​రెడ్డి

Kishan Reddy on Railway Projects in Telangana : 'కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి ఏ ప్రాజెక్టులు కేటాయించినా.. తెలంగాణ ప్రభుత్వం సహకరించడం లేదు'

Last Updated : Sep 8, 2023, 7:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.