ETV Bharat / state

Kishan Reddy Fires on CM KCR : 'కమలం వికసిస్తుంటే.. కేసీఆర్ గడబిడ అవుతున్నారు'

Kishan Reddy Fires on CM KCR : ప్రధాని పాలమూరు, ఇందూరు సభలకు ప్రజల నుంచి విశేషమైన స్పందన వచ్చిందని కిషన్​రెడ్డి అన్నారు. సమగ్రమైన ఎన్నికల ప్రణాళికతో సమర శంఖారావం పూరించాల్సి ఉందని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం నుంచి కాషాయ జెండా ఎగురవేస్తామనే ఆత్మ విశ్వాసంతో తమ ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. బీఆర్ఎస్ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పించాలని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Kishan Reddy Fires on KTR
Kishan Reddy
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 6, 2023, 2:30 PM IST

Kishan Reddy Fires on CM KCR : రాష్ట్రంలో బీజేపీకి మద్దతు తెలిపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కేంద్రమంత్రి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డి అన్నారు. సమగ్రమైన ఎన్నికల ప్రణాళికతో సమర శంఖారావం పూరించాల్సి ఉందని తెలిపారు. ప్రధాని పాలమూరు, ఇందూరు సభలకు ప్రజల నుంచి విశేషమైన స్పందన వచ్చిందని చెప్పారు. బీఆర్ఎస్ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పించాలని అన్నారు. హైదరాబాద్​లో జరుగుతున్న బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, లక్ష్మణ్, డీకే అరుణ తదితరులు పాల్గొన్నారు.

Telangana BJP State Council Meeting : సమావేశంలో మాట్లాడిన కిషన్​రెడ్డి.. కాంగ్రెస్, బీఆర్ఎస్​పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్ర కౌన్సిల్ సమావేశం నుంచి కాషాయ జెండా ఎగురవేస్తామనే ఆత్మ విశ్వాసంతో తమ ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. మహిళా రిజర్వేషన్లకు మద్దతు ఇవ్వని ఎంఐఎంతో కలిసి బీఆర్ఎస్​ పనిచేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్‌ ఎంపీలు కూడా మహిళా రిజర్వేషన్‌ బిల్లు(Womens Reservation Bill) ఓటింగ్‌లో పాల్గొనలేదని విరుచుకుపడ్డారు.

Kishan Reddy Comments on BRS Congress : "దళితులను దద్దమ్మలుగా చిత్రీకరించి కేసీఆర్ సీఎం కుర్చీలో కూర్చున్నారు. ఉద్యోగ పరీక్షలను నిర్వహించలేని ప్రభుత్వం ఇది. బీజేపీని విమర్శించే అర్హత కేసీఆర్​కు లేదు. మలి దశ ఉద్యమంలో యువత బలి దానాలకు కాంగ్రెస్ కారణం కాదా?. కాంగ్రెస్ పార్టీకీ తెలంగాణలో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు. పార్లమెంట్​లో తెలంగాణ బిల్లు పాస్ అవుతుంటే పాల్గొనని అతను కేసీఆర్. మిలియన్ మార్చ్, సాగర హరానికి రాని కేసీఆర్ తెలంగాణ తాను తెచ్చినట్లు గొప్పలు చెబుతున్నారు." అని కిషన్​రెడ్డి రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ధ్వజమెత్తారు.

Kishan Reddy Comments on CM KCR : 'ప్రధాని మోదీ తెలంగాణకు వస్తుంటే.. కేసీఆర్ ఇంట్లో కూర్చొని కుట్రలు చేస్తున్నారు'

Kishan Reddy Speech in BJP State Council Meeting Hyderabad : రాష్ట్రంలో ప్రభుత్వ భూములు, మద్యం అమ్మనిదే పాలన సాగే పరిస్థితి లేదని కిషన్​రెడ్డి విమర్శించారు. కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ నేతలు తెలంగాణను దోచుకుంటున్నారని ఆరోపించారు. దేశంలో ఏ మాత్రం మార్పు రావాలన్న బీజేపీ వల్లే సాధ్యమని స్పష్టం చేశారు. మహిళలను అవమానించే రజాకార్ల పార్టీ హైదరాబాద్​లో పుట్టిందని.. మజ్లిస్ పార్టీ మహిళా రిజర్వేషన్లను వ్యతిరేకించిందని వివరించారు. కేసీఅర్ కూడా మహిళా వ్యతిరేకి అని.. కేసీఆర్ తొలి మంత్రివర్గంలో ఐదేళ్లు మహిళకు చోటు కల్పించకుండా పాలించారని కిషన్ రెడ్డి అన్నారు.

Kishan Reddy on Womens Reservation Bill : మహిళల ఓట్లు అడిగే అర్హత కాంగ్రెస్​కు లేదని కిషన్​రెడ్డి విమర్శించారు. కొందరు ప్రధాని నరేంద్రమోదీని ట్విటర్​లో విమర్శిస్తున్నారని మండిపడ్డారు. కేటీఆర్ తండ్రిని అడ్డం పెట్టుకుని రాజకీయాల్లోకి వచ్చి దోచుకుంటున్నారని కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణను రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్న కిషన్​రెడ్డి.. మజ్లిస్ ఆధిపత్యం రోజు రోజుకు పెరిగిపోతుందన్నారు. డిసెంబర్​లో జరిగే ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యేలను గెలిపించుకుని అసెంబ్లీకి తీసుకురావాలని కోరారు.

JP Nadda Visits Telangana : తెలంగాణ వికాసం కోసం కేంద్రం తొమ్మిదేళ్లలో రూ.9 లక్షల కోట్లు కేటాయించిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) అన్నారు. సికింద్రాబాద్ మోడ్రన్ రైల్వే స్టేషన్, బీబీ నగర్ ఎయిమ్స్​ను కేంద్రం అభివృద్ధి చేసిందని పేర్కొన్నారు. తెలంగాణ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ గిరిజన విశ్వవిద్యాలయం, పసుపు బోర్డు ప్రకటించారని చెప్పారు. కమలం వికసిస్తుంటే.. కేసీఆర్ గడబిడ అవుతున్నారని మండిపడ్డారు. కాకినాడ సభలో బీజేపీ తెలంగాణకు మద్దతు ప్రకటించిందని వివరించారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ ప్రభావం తగ్గి.. ప్రాంతీయ పార్టీలు బలోపేతం అవుతున్నాయన్నారు. స్థిరమైన ఆర్థిక వ్యవస్థ కేవలం భారతదేశంలోనే ఉందని జేపీ నడ్డా తెలిపారు.

Kishan Reddy Fires on CM KCR : అబద్ధాలు ఆడటం.. ప్రజలను మభ్యపెట్టడంలో కల్వకుంట్ల కుటుంబం ఫస్ట్‌: కిషన్​రెడ్డి

Kishan Reddy on Telangana Elections Schedule : తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు: కిషన్‌రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.