విద్యారంగానికి ఎన్వీఆర్ఎల్ఎన్ రావు చేసిన సేవలు చిరస్మరణీయమని కేంద్ర సహయక మంత్రి కిషన్రెడ్డి అన్నారు. హైదరాబాద్ తార్నాకలోని మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు నివాసానికి వెళ్లిన ఆయన రామచంద్రరావు తండ్రి ప్రొ.ఎన్వీఆర్ఎల్ఎన్ రావు ఇటీవల మరణించిన నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.
మాజీ ఎమ్మెల్సీ రాంచంద్రరావు కుటుంబ సభ్యులను పరామర్శించిన కిషన్రెడ్డి అనంతరం ఎన్వీఆర్ఎల్ ఎన్ రావు చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించినట్లు తెలిపారు.
ఇదీ చదవండి: MAOIST JAGAN: 'ఆస్తుల రక్షణ కోసమే భాజపాలోకి ఈటల'