ETV Bharat / state

Kishan Reddy on KCR: 'దళిత బంధు కాస్తా.. బీఆర్‌ఎస్‌ బంధు అయింది' - Kishan Reddy fires on KCR

Kishan Reddy Comments on KCR: కేసీఆర్ తెలంగాణలో పాలనను గాలికి వదిలేసి.. కేంద్రాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ప్రజలను పక్కదారి పట్టించేందుకు కల్వకుంట్ల కుటుంబం ఎత్తుగడలు వేస్తోందని విమర్శించారు. దళిత బంధు కాస్తా.. బీఆర్‌ఎస్‌ బంధు అయిందని ఆయన ఎద్దేవా చేశారు.

Kishan Reddy
Kishan Reddy
author img

By

Published : Apr 16, 2023, 6:56 PM IST

Kishan Reddy Comments on KCR: ముఖ్యమంత్రి కేసీఆర్ వంద రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని హామీ ఇచ్చారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి గుర్తు చేశారు. తొమ్మిదేళ్లు అవుతున్న ఫ్యాక్టరీకి సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని ఆరోపించారు. ముఖ్యమంత్రికి విశాఖ ఉక్కు పరిశ్రమ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. స్టీల్‌ప్లాంట్ పేరుతో సీఎం గాంభీర్యాలు ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

విశాఖ స్టీల్ ప్లాంట్​ కొనుగోలు ఎంత వరకు సమంజసమో కల్వకుంట్ల కుటుంబం సమాధానం చెప్పాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అనేక పరిశ్రమలు మూతపడ్డాయని.. ఒక్క పరిశ్రమనైనా ముఖ్యమంత్రి తెరిపించారా అని ప్రశ్నించారు. ఒకవైపు సింగరేణిని కేంద్రం ప్రైవేటీకరణ చేస్తుందంటూ ప్రచారం చేస్తూనే.. మరోవైపు సింగరేణితోనే విశాఖ స్టీల్‌ప్లాంట్ కొంటాం అంటున్నారని దుయ్యబట్టారు. ఈ క్రమంలోనే సింగరేణిలో పని చేసే కార్మికులు అసంతృప్తితో ఉన్నారని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

ప్రధాని హైదరాబాద్‌కు వస్తే బీఆర్ఎస్ పార్టీ నిరసనలు చేపట్టిందని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. సింగరేణిని కేంద్రం ప్రైవేట్ పరం చేస్తుందంటూ బీఆర్ఎస్ శ్రేణులు ధర్నాలు కూడా నిర్వహించారని విమర్శించారు. కేసీఆర్ తెలంగాణలో పాలనను గాలికి వదిలేసి.. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజలను పక్కదారి పట్టించేందుకు కల్వకుంట్ల కుటుంబం ఎత్తుగడలు వేస్తోందని కిషన్‌రెడ్డి ఆరోపించారు.

రాజకీయ ఎత్తుగడే తప్పా: తొమ్మిదేళ్ల తరువాత కేసీఆర్ నిద్ర మేలుకొని అంబేడ్కర్ జయంతి రోజు నివాళులు అర్పించారని కిషన్‌రెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రికి రాజకీయ ఎత్తుగడే తప్పా.. అంబేడ్కర్‌పై గౌరవం లేదన్నారు. భద్రాచలం సీతారాముల కల్యాణానికి పట్టు వస్త్రాలు సమర్పించే దానికి సీఎం తిలోదకాలు ఇచ్చారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రికి ఇప్తార్ విందుకు వెళ్లేందుకు సమయం ఉంటుందని.. కానీ భద్రాచలానికి మాత్రం రారని కిషన్‌రెడ్డి ఆరోపించారు.

దళిత బంధు కాస్తా.. బీఆర్‌ఎస్‌ బంధు అయింది: దళిత బంధు కాస్తా.. బీఆర్‌ఎస్‌ బంధు అయిందని కిషన్‌రెడ్డి వ్యంగాస్త్రాలు సంధించారు. ముఖ్యమంత్రికి రాసే లేఖలు సమాజం కోసం రాస్తున్నానని.. ఆయన స్పందిస్తారని కాదని ఎద్దేవా చేశారు. ఈ క్రమంలోనే వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి ఉన్నా.. ఇంకెవరు ఉన్నా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.

"నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్‌ దానిని విస్మరించారు. ఇప్పుడు విశాఖ స్టీల్‌ప్లాంట్‌ పేరుతో గాంభీర్యాలు ప్రదర్శిస్తున్నారు. తెలంగాణలో మూతపడిన ప్రభుత్వరంగ పరిశ్రమల్లో ఎన్నింటిని తెరిచారో కేసీఆర్‌ సమాధానం చెప్పాలి. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల్ని పక్కదారి పట్టించేందుకు కల్వకుంట్ల కుటుంబం ఎత్తుగడలు వేస్తోంది. ఎప్పుడు అంబేడ్కర్ జయంతికి హాజరుకాని కేసీఆర్ ఇప్పుడు 125అడుగుల విగ్రహం పేరుతో రాజకీయాలు చేస్తున్నారు." -కిషన్‌రెడ్డి, కేంద్రమంత్రి

విశాఖ స్టీల్‌ప్లాంట్ పేరుతో.. కేసీఆర్ గాంభీర్యాలు ప్రదర్శిస్తున్నారు

ఇవీ చదవండి: Governor Tamilisai: 'వ్యవసాయ అనుబంధ రంగాల్లో యువతకు మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయి'

కర్ణాటక ఎన్నికలు.. BJPకి మాజీ సీఎం రాజీనామా.. కాంగ్రెస్​ 'ఆపరేషన్​ హస్త'.. ఏం జరగనుందో?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.