ETV Bharat / state

Kishan Reddy Comments on CM KCR : 'ప్రధాని మోదీ తెలంగాణకు వస్తుంటే.. కేసీఆర్ ఇంట్లో కూర్చొని కుట్రలు చేస్తున్నారు' - ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన

Kishan Reddy Comments on CM KCR : ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు వస్తుంటే.. కేసీఆర్ ఇంట్లో కూర్చొని కుట్రలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్.. ఇంకో 90 రోజులే అధికారంలో ఉంటారని.. ఇక శాశ్వతంగా ఫామ్​హౌస్​లో ఉండబోతున్నారని జోస్యం చెప్పారు. కాంగ్రెస్​కు ఓటేస్తే బీఆర్ఎస్​కు ఓటేసినట్లేనని పునరుద్ఘాటించారు. ఈ క్రమంలోనే 6 కాదు 60 గ్యారంటీలు ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో గెలిచే పరిస్థితి లేదన్నారు. తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని.. ఈసారి తమవైపే ఉన్నారని కిషన్​రెడ్డి ధీమా వ్యక్యం చేశారు.

Kishan Reddy Comments on BRS and Congress
Kishan Reddy
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 30, 2023, 4:09 PM IST

Kishan Reddy Comments on CM KCR : 'కేసీఆర్ కో హటావో.. తెలంగాణ కో బచావో'.. ప్రస్తుతం ఇది రాష్ట్ర ప్రజల నినాదంగా మారిపోయిందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డి(Kishan Reddy) అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం కేవలం పేపర్​ల మీద, ఫ్లెక్సీల మీద మాత్రమే కనిపిస్తున్నాయని మండిపడ్డారు. బీజేపీ కార్యాలయంలో మాజీ మంత్రులు చిత్తరంజన్ దాస్, కృష్ణాయాదవ్​లతో పాటు పలువురు జడ్పీటీసీలు, మాజీ జడ్పీటీసీలు కేంద్రమంత్రి కిషన్​రెడ్డి, ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్(Etela Rajender), బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ(DK Aruna) సమక్షంలో చేరారు. అనంతరం సమావేశంలో మాట్లాడిన కిషన్​రెడ్డి.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్రంగా విమర్శలు చేశారు.

Kishan Reddy Fires on KCR Government : బీఆర్ఎస్ హయాంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దివాళా తీసిందని.. 9 ఏళ్లలో వారు రాష్ట్రాన్ని అవినీతిమయం చేశారని కిషన్​రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలోని ప్రజలకు బీఆర్ఎస్ ప్రభుత్వం(BRS Government), కేసీఆర్ కుటుంబంపై తీవ్ర వ్యతిరేకత ఉందని ఎద్దేవా చేశారు. ప్రస్తుత మంత్రులు ఓడిపోయే అవకాశం ఉందని.. అందుకే కేసీఆర్ తొండి ఆటలు ఆడుతున్నారని వ్యాఖ్యానించారు. బడుగు, బలహీనవర్గాలకు మేలు చేసేందుకు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు వస్తుంటే.. కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆరోపించారు. తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని తెలిపారు.

Kishan Reddy on PM Modi Telangana Tour : 'నిజామాబాద్‌ సభలోనే తెలంగాణలో మోదీ ఎన్నికల శంఖారావం'

Kishan Reddy Reaction on Congress 6 Guarantees : ప్రధాని మోదీ(PM Modi Telangana Tour) తెలంగాణకు వస్తుంటే.. కేసీఆర్(CM KCR) ఇంట్లో కూర్చొని కుట్రలు చేస్తున్నారని కిషన్​రెడ్డి మండిపడ్డారు. తొమ్మిదేళ్లలో రూ.9 లక్షల కోట్లు ఖర్చు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు వస్తున్నారని కిషన్​రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ ఇక 90 రోజులే అధికారంలో ఉంటారని.. శాశ్వతంగా ఫామ్​హౌస్​లో ఉండబోతున్నారని జోస్యం చెప్పారు. కాంగ్రెస్​కు ఓటేస్తే గెలిచిన వాళ్లు బీఆర్ఎస్​లో చేరతారని.. గతంలో జరిగిన ఘటనలే అందుకు నిదర్శనమని అన్నారు. కాంగ్రెస్​కు ఓటేస్తే బీఆర్ఎస్​కు ఓటేసినట్లేనని పునరుద్ఘాటించారు. ఈ క్రమంలోనే 6 కాదు 60 గ్యారంటీలు ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో గెలిచే పరిస్థితి లేదన్నారు.

Kishan Reddy Comments on CM KCR ప్రధాని మోదీ తెలంగాణకు వస్తుంటే కేసీఆర్ ఇంట్లో కూర్చొని కుట్రలు చేస్తున్నారు

Kishan Reddy on PM Modi Telangana Tour : అక్టోబర్​ 1న (రేపు) ప్రధాని మోదీ(Prime Minister Narndra Modi) పాలమూరు గడ్డకు, 3న నిజామాబాద్ జిల్లాకు రాబోతున్నారని కిషన్​రెడ్డి పేర్కొన్నారు. ఈ రెండు ఉమ్మడి జిల్లాల్లో సుమారు రూ.20 వేల కోట్ల అభివృద్ధి పనులను ప్రధాని మోదీ జాతికి అంకితం చేయబోతున్నారని తెలిపారు. ప్రధాని మోదీ ఈ రెండు సభల్లో అనేక కానుకలు ప్రకటించబోతున్నారని కిషన్​రెడ్డి పేర్కొన్నారు.

Kishan Reddy on PM Modi Telangana Tour : 'ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడల్లా.. కేసీఆర్​కు జ్వరం వస్తుంది'

Kishan Reddy on PM Modi Telangana Tour : ప్రధాని మోదీ.. అక్టోబర్​ 3న నిజామాబాద్​ బహిరంగ సభలో పాల్గొంటారు: కిషన్​రెడ్డి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.