ETV Bharat / state

Kishan Reddy Comments on BRS and Congress : 'ప్రజలు కుటుంబ పార్టీల పాలన కోరుకోవడం లేదు' - telangana election 2023

Kishan Reddy Comments on BRS and Congress : కేసీఆర్​ను ఓడించడమే లక్ష్యంగా.. ప్రజలు ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డి పేర్కొన్నారు. గెలుపే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఎన్నికల్లో డబ్బు పంచి గెలిచేందుకు చూస్తున్నారని.. బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ అధ్యక్షుడు ఈటల రాజేందర్‌ తప్పుబట్టారు.

T BJP Latest News
Kishan Reddy Fires on BRS
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 12, 2023, 8:20 PM IST

Kishan Reddy Fires on BRS : రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతున్నాయని.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డి(Kishan Reddy) పేర్కొన్నారు. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో కాషాయపార్టీలోకి చేరిన వీరశైవ లింగాయత్‌ రాష్ట్ర అధ్యక్షుడు వన్నె ఈశ్వరప్పకు.. కిషన్​రెడ్డి, లక్ష్మణ్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు కేసీఆర్​ ప్రభుత్వం పోవాలని కంకణం కట్టుకున్నారని దుయ్యబట్టారు.

Telangana Election Campaign 2023 : ప్రచార సందడి షురూ.. ప్రజాక్షేత్రంలోకి ప్రధాన పార్టీలు.. విమర్శలు ప్రతివిమర్శలతో వేడెక్కుతున్న రాజకీయం

T BJP Latest News : తెలంగాణ మా ఆస్తి.. మా కుటుంబానికే హక్కు ఉన్నట్లు కేసీఆర్ కుటుంబం వ్యవహరిస్తోందని కిషన్​రెడ్డి విమర్శించారు. కేసీఆర్​ను ఓడించడమే లక్ష్యంగా ప్రజలు.. ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ కూడా కుటుంబ పార్టీయేనని.. రాష్ట్రంలో ప్రజలు కుటుంబ పార్టీల పాలన కోరుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను అమ్ముకునే పార్టీ అని.. 2014, 18లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్​కు అమ్ముడుపోయారని విమర్శించారు.

కాంగ్రెస్​కు ఓటేస్తే బీఆర్​ఎస్​కు ఓటేసినట్లేనని కిషన్​రెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్, బీఆర్​ఎస్​ రెండింటికి వేస్తే మజ్లిస్​కీ వేసినట్లే అవుతుందన్నారు. బీఆర్​ఎస్​ మరోసారి అధికారంలోకి వస్తే ప్రజల చేతిలో చిప్ప మాత్రమే మిగులుతుందని ఎద్దేవా చేశారు. పేద ప్రజలకు మద్యం తాగిస్తూ ప్రాణాలు బలి తీసుకుంటున్నారని.. బెల్ట్ షాపుల పేరుతో బీఆర్​ఎస్​ సర్కారు.. ప్రజల రక్తం తాగుతోందని విమర్శించారు. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు.

"రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. కేసీఆర్​ను ఓడించడమే లక్ష్యంగా ప్రజలు.. ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ కూడా కుటుంబ పార్టీయే.. రాష్ట్రంలో ప్రజలు కుటుంబ పార్టీల పాలన కోరుకోవడంలేదు". - కిషన్​రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

Bandi Sanjay Comments on Minister Harish Rao : బీఆర్​ఎస్​ అడ్డా మీద కూలీలను తీసుకొచ్చి పార్టీ కండువాలు కప్పుతుందోని.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్(Bandi Sanjay)​ విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్​ఎస్​ ఒక్కటేనని ప్రజలు నమ్ముతున్నారని తెలిపారు. తమ పార్టీ అభ్యర్థుల జాబితా దిల్లీకి వెళ్లిందని, కాంగ్రెస్​ అభ్యర్థుల జాబితా ప్రగతిభవన్​కు వెళ్లిందని ఎద్దేవా చేశారు. మందికి పుట్టిన వాళ్లు.. నా వాళ్లు అనుకునే నీచమైన బుద్ది కేసీఅర్​దని దుయ్యబట్టారు. కాంగ్రెస్, బీఆర్​ఎస్​, మజ్లిస్ కలిసి అధికారంలోకి రావాలని ప్లాన్ చేస్తున్నాయని పేర్కొన్నారు.

BJP MP Laxman on BC Reservations : బీజేపీ రాజకీయంగా బీసీలకు పెద్ద పీట వేసిందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. బీసీల అభ్యున్నతి కోసం ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని తెలిపారు. రాహుల్‌ గాంధీ, రేవంత్​రెడ్డిలకు బీసీల ఓట్లు అడిగే నైతక హక్కు లేదన్నారు. ఈశ్వరప్ప రాష్ట్రవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహించారని.. అయన బీజేపీలో చేరడం శుభపరిణామమని పేర్కొన్నారు. రాష్ట్రంలో 54 శాతం ఉన్న బీసీలకు కేవలం మూడు మంత్రి పదవులే ఇచ్చిన కేసీఆర్‌కు కేటీఆర్‌కు బీసీల ఓట్లు అడిగే హక్కులేదన్నారు. గెలుపే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఎన్నికల్లో డబ్బు పంచి గెలిచేందుకు చూస్తున్నారని.. బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ అధ్యక్షుడు ఈటల రాజేందర్‌ తప్పుబట్టారు.

Kishan Reddy Comments on BRS and Congress 'వేగంగా మారుతున్న రాజకీయ పరిస్థితులు.. ప్రజలు కుటుంబపార్టీల పాలన కోరుకోవడం లేదు'

Telangana BJP professionals and intellectuals Meet : 'బీజేపీ.. సిద్ధాంతాల పార్టీ.. బీఆర్​ఎస్​కు ఏం విధానం ఉంది?'

BJP Telangana Election Committees 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా.. బీజేపీ 14 కమిటీలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.