central minister kishan reddy attends to healthy baby program: హైదరాబాద్ సనత్‌నగర్‌లో జరిగిన హెల్తీ బేబీ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సనత్‌నగర్‌లో హెల్తీ బేబీ షో కార్యక్రమంలో పాల్గొన్న కిషన్ రెడ్డి తల్లి పాల గురించి, దాని ప్రాముఖ్యత గురించి పలు విషయాలను ప్రజలకు తెలియజేశారు. తల్లి పాలు బిడ్డకు అమృతం లాంటివని, తల్లి పాలే బిడ్డకు ఆహారం, మందు, వైద్యం అని చెప్పుకొచ్చారు. పసి పిల్లల ఆరోగ్యం కాపాడటం కోసం ప్రధాని మోదీ సూచనలతో దేశవ్యాప్తంగా హెల్తీ బేబీ షో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని తెలియజేశారు.
పసిపిల్లల ఆరోగ్యమే లక్ష్యంగా..: పసి పిల్లల ఆరోగ్యం కాపాడటమే లక్ష్యంగా హెల్తీ బేబీ షో తెలంగాణలో ప్రారంభించారు. ఈ వినూత్న కార్యక్రమానికి హాజరైన కిషన్ రెడ్డి చిన్న పిల్లలకు సంబంధించిన పలు విషయాలను ప్రజలతో పంచుకున్నారు. తల్లి పాల అవసరం గురించి మాట్లాడుతూ.. తల్లి పాలు బిడ్డకు అమృతం లాంటివన్నారు. తల్లి పాలే బిడ్డకు ఆహారం, మందు, వైద్యం అన్నారు. సనత్‌నగర్ నియోజకవర్గంలో జరిగిన హెల్తీ బేబీ షో కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కిషన్ రెడ్డి.. అక్కడికి వచ్చిన చిన్నారులతో సరదాగా ఫొటోలు దిగారు. చిన్న పిల్లల ఆరోగ్యం.. తల్లి పాల ప్రాముఖ్యతను తెలియజేశారు. దేశంలోని ప్రతి ఎంపీ నియోజకవర్గంలో హెల్తీ బేబీ షో కార్యక్రమం నిర్వహించాలని ప్రధాని మోదీ ఆదేశించారన్నారు.
తల్లిపాల వల్ల రోగనిరోధక శక్తి.. 3 నుంచి 13 నెలల పసి పిల్లలతో హెల్తీ బేబీ షో నిర్వహిస్తున్నారన్నారు. పిల్లలను తల్లులు ఎంతో పోటీ తత్వంతో పెంచుతున్నారన్న కిషన్ రెడ్డి.. ఇది చాలా మంచి పరిణామమన్నారు. కొందరు తల్లులు పిల్లలకు డబ్బా పాలు ఇస్తారని.. అయితే తల్లి పాలే పిల్లలకు మంచిదన్నారు. తల్లి పాల వల్ల పిల్లలు పెద్ద అయ్యాక కూడా రోగ నిరోధక శక్తి వల్ల ఆరోగ్యంగా ఉంటారన్నారు. ప్రభుత్వం, సమాజం తరఫున తల్లిపాలను ప్రోత్సహించడానికే ఈ కార్యక్రమం తీసుకొచ్చామన్నారు కిషన్ రెడ్డి. హెల్తీ బేబీ షో సర్టిఫికెట్ పిల్లలు పెద్ద అయిన తర్వాత కూడా గుర్తుగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన తల్లులకు హెల్తీ బేబీ షో సర్టిఫికెట్, ఫొటో ఫ్రేమ్, కిట్‌ను కూడా కిషన్‌రెడ్డి అందజేశారు.
ఇవీ చదవండి: