ETV Bharat / state

Key Changes in Telangana BJP : రాష్ట్ర శాసనసభ ఎన్నికల వేళ.. కమలదళానికి కొత్త సారథులు - Telangana Assembly Election Latest News

BJP Focus on Telangana Assembly Elections : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. జాతీయ నాయకత్వం రాష్ట్ర అధ్యక్షుడిని మారుస్తూ నిర్ణయం తీసుకుంది. బండి సంజయ్ స్థానంలో.. కేంద్రమంత్రి కిషన్​రెడ్డిని కొత్తసారథిగా నియమించింది. త్వరలో పలు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ కమలదళం సంస్థాగత మార్పులు చేపట్టింది. ఎన్నికల నిర్వహణ కమిటీని కొత్తగా ఏర్పాటు చేసిన దిల్లీ నేతలు.. ఛైర్మన్‌గా ఈటల రాజేందర్‌కు బాధ్యతలు అప్పగించారు. ఈ ఇద్దరి నేతృత్వంలోనే శాసనసభ ఎన్నికలను ఎదుర్కోనున్నారు.

Kishan Reddy Appointed BJP Telangana Chief

author img

By

Published : Jul 5, 2023, 8:06 AM IST

అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ కమలదళం సంస్థాగత మార్పులు

Kishan Reddy Appointed Telangana BJP President : వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలతో పాటు.. త్వరలో పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. బీజేపీ జాతీయ నాయకత్వం సంస్థాగత మార్పులు చేపట్టింది. తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాలకు నూతన అధ్యక్షులను నియమించింది. రాష్ట్రానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని అధ్యక్షుడిగా నియమించింది. కొంతకాలంగా అధ్యక్షుడి మార్పుపై జరుగుతున్న చర్చకు ముగింపు పలికింది. బండి సంజయ్ స్థానంలో కిషన్‌రెడ్డికి సారథ్య బాధ్యతలు కట్టబెట్టింది.

BJP Organisational Changes On Comming Elections : పార్టీ బలోపేతానికి కృషి చేసిన సంజయ్ నేతృత్వంలోనే శాసనసభ ఎన్నికలను ఎదుర్కొంటామని.. అగ్ర నాయకత్వం పలుమార్లు ప్రకటించింది. సంజయ్ అధ్యక్షుడు అయ్యాక జరిగిన దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో 48 స్థానాలను కైవసం చేసుకుంది. పట్టణానికే పరిమితమైన కాషాయ పార్టీని ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో.. గ్రామీణ ప్రాంతాలకు తీసుకెళ్లిన ఘనత సంజయ్​కే దక్కుతుంది. ఆయన నాయకత్వం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాకు విశ్వాసం ఉంది.

కిషన్​రెడ్డికి రాష్ట్ర అధ్యక్షుడిగా పగ్గాలు : ప్రధాని రాష్ట్ర పర్యటన సందర్భంగా జన సమీకరణ, కార్యకర్తల్లో ఉత్సాహం చూసి బండికి కితాబు ఇచ్చారు. సంజయ్ పదవి కాలం ఈ ఏడాది మార్చి 11వ తేదీ నాటికి ముగిసినప్పటికి అధ్యక్షుడిగా కొనసాగించింది. 2024లో జరిగే పార్టీ సంస్థాగత ఎన్నికల వరకు అధ్యక్షుడిగా ఉంటారని.. ఆయన సారథ్యంలోనే అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటామని అగ్ర నాయకత్వం స్పష్టం చేసింది. అయితే అకస్మాత్తుగా అధ్యక్షుడి మార్పుపై ఊహగానాలు తలెత్తడం.. వాటిని నిజం చేస్తూ జాతీయ నాయకత్వం కిషన్​రెడ్డికి బాధ్యతలు కట్టబెట్టింది.

Etela Rajender as BJP State Election Management Committee Chairman : నాయకుల మధ్య సమన్వయమే ధ్యేయంగా ఈటల రాజేందర్‌కు బీజేపీ అధిష్ఠానం.. ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా నియమించింది. హుజురాబాద్‌ ఎన్నికలో విజయం సాధించిన తర్వాత ఈటల సేవల్ని ఉపయోగించుకోవడంపై కొన్ని నెలలుగా చర్చ జరుగుతోంది. పార్టీ అధ్యక్ష పదవి సహా ఇతర కీలక పదవుల అంశం చర్చకు వచ్చింది. ఎన్నికల నిర్వహణ బాధ్యతలు అప్పగించడం ద్వారా ప్రయోజనం ఉంటుందని భావించిన దిల్లీ నేతలు.. రాష్ట్ర బీజేపీలో తొలిసారి ఎన్నికల నిర్వహణ కమిటీ ఏర్పాటు చేసి దీనికి ఛైర్మన్‌గా ఈటలను ప్రకటించారు. పార్టీ అగ్ర నాయకత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని.. తెలంగాణలో వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమేనని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.

"తెలంగాణ అంతరంగం, సమస్యలు పూర్తిగా తెలిసిన వాడిని. సీఎం కేసీఆర్‌ బలం, బలహీనతపై అవగాహన ఉన్నోడిని. పార్టీ అధిష్ఠానం అప్పగించిన బాధ్యతను సంపూర్ణంగా నిర్వహిస్తా. కిషన్‌ రెడ్డి ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి. ఆయనతో కలిసి పని చేస్తా. కేసీఆర్‌ అహంకారాన్ని ఓడించడం బీజేపీతోనే సాధ్యం. బండి సంజయ్‌ నేతృత్వంలో నాలుగు ఎన్నికలు గెలిచాం. రాష్ట్రంలో గెలిస్తే బీజేపీ.. లేదంటే బీఆర్​ఎస్ గెలిచాయి. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఏ ఎన్నికనూ గెలవలేదు. బీఆర్​ఎస్ గెలిస్తే ఒక కుటుంబానికి మాత్రమే లాభం. బీజేపీ గెలిస్తే ప్రజలకు లాభం." -ఈటల రాజేందర్​, హుజురాబాద్ ఎమ్మెల్యే

బండి సంజయ్‌కు ప్రాధాన్యం కల్పించాలి : మరోవైపు రాష్ట్రంలో మూడేళ్లకు పైగా కీలక సమయంలో పార్టీకి సేవలందించి, బలోపేతం చేసిన బండి సంజయ్‌కు.. సముచిత ప్రాధాన్యం కల్పించాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. సామాజిక సమీకరణాలు, నాలుగైదు నెలల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. కేంద్ర కేబినెట్‌లో అవకాశం ఇవ్వడం ద్వారా పార్టీకి ప్రయోజనకరంగా ఉంటుందని కొందరు నాయకులు అగ్రనేతల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.

BJP Focus on Assembly Elections : ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపురావును దిల్లీకి రప్పించడంపైనా చర్చ జరుగుతోంది. రాజ్యసభ్యుడు లక్ష్మణ్‌, నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ కూడా పదవులపై ఆశాభావంతో ఉన్నారు. కేంద్రమంత్రి పదవులు కాకుంటే.. పార్టీ జాతీయ వ్యవహారాల్లో భాగస్వామ్యం వంటి అవకాశాలివ్వవచ్చని చర్చ జరుగుతోంది. కిషన్‌రెడ్డి, ఈటల నేతృత్వంలో అధికారంలోకి వస్తామని.. నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. సారథి మార్పు నేపథ్యంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాలపై జాతీయ నాయకత్వం ప్రత్యేక శ్రద్ధచూపనుందని సమాచారం. ప్రధాని మోదీ వరంగల్‌ పర్యటన అనంతరం పూర్తిస్థాయిలో దృష్టి సారించదని, పూర్తిస్థాయిలో పరిధులను నిర్దేశించి బాధ్యతల్ని అప్పగించనున్నట్లు తెలుస్తోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.