ETV Bharat / state

Kishan Reddy about Krishna Water Sharing : 'కేంద్ర నిర్ణయంతో కృష్ణా జలాల సమస్య పరిష్కారమవుతుందని ఆకాంక్షిస్తున్నా' - Kishan Reddy latest news

Kishan Reddy about Krishna Water Sharing : కృష్ణా జల వివాదాలను పరిష్కరించిన కేంద్రానికి కిషన్​రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. 2021లో రిట్‌ పిటిషన్‌ను తెలంగాణ ఉపసంహరించుకుందని.. సమస్య పరిష్కరించాలని రెండు రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయని చెప్పారు. రెండు రాష్ట్రాలతో కేంద్రం అనేకసార్లు మాట్లాడిందని.. సొలిసిటర్‌ జనరల్‌ అభిప్రాయాన్ని కూడా తీసుకుందని కిషన్​రెడ్డి వెల్లడించారు.

Krishna water
Kishan Reddy
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 4, 2023, 5:41 PM IST

Kishan Reddy about Krishna Water Sharing at Telangana and AP : కృష్ణా జలాల్లో వాటా తేల్చాలని తెలంగాణ కోరుతోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) పేర్కొన్నారు. కృష్ణా జలాల (Krishna Water) పంపిణీపై కేంద్రం, తెలంగాణ మధ్య చర్చలు జరిగాయని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతోనే తెలంగాణ ఉద్యమం వచ్చిందని గుర్తు చేశారు. జల వివాదాలు పరిష్కరించిన కేంద్ర ప్రభుత్వానికి దిల్లీలో కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుత ట్రైబ్యునల్‌కు (Tribunal) ప్రత్యామ్నాయం ఏర్పాటుపై చర్చ జరిగిందని వివరించారు.

'కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా 34 శాతం, ఏపీకి 66'

Krishna Water Sharing : ఈ క్రమంలో 2021లో రిట్‌ పిటిషన్‌ను తెలంగాణ ఉపసంహరించుకుందని కిషన్‌రెడ్డి తెలిపారు. సమస్య పరిష్కరించాలని రెండు రాష్ట్రాలు కేంద్రాన్ని కోరాయని చెప్పారు. రెండు రాష్ట్రాలతో కేంద్రం అనేకసార్లు మాట్లాడిందని గుర్తు చేశారు. సొలిసిటర్‌ జనరల్‌ అభిప్రాయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకుందని అన్నారు. సొలిసిటర్‌ జనరల్‌ 2023 జులైలో న్యాయశాఖకు నివేదిక ఇచ్చారని పేర్కొన్నారు. ట్రైబ్యునల్‌లో అదనపు నిబంధనలు చేర్చాలని నిర్ణయించారని కిషన్​రెడ్డి వెల్లడించారు.

Union Cabinet Orders to Krishna Water Dispute Tribunal : సెక్షన్‌ 12కు అదనపు నిబంధనలు చేర్చి సమస్య పరిష్కరించుకోవచ్చని సూచించారని కిషన్​రెడ్డి వివరించారు. ఈ సెక్షన్​కు అదనపు నిబంధనలు చేర్చి సమస్య పరిష్కరించాలని కేంద్రం నిర్ణయించిదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో సమస్య పరిష్కారమవుతుందని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రధానికి తెలుగు రాష్ట్రాల తరఫున ధన్యవాదాలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణలో కేంద్రం గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తోందని కిషన్​రెడ్డి వివరించారు.

Telangana Govt Letter to KRMB Chairman : 'గతేడాది ఏపీ ఎక్కువగా వాడుకున్న జలాలను ఈ ఏడాది జమ చేయాలి'

Kishan Reddy on Tribal University : తెలంగాణలో 9.08 శాతం మంది గిరిజనులు ఉన్నారని కిషన్​రెడ్డి తెలిపారు. 2011 గణాంకాల ప్రకారం గిరిజన అక్షరాస్యత 49.51 శాతం అని అన్నారు. కేంద్ర విద్యాశాఖ ద్వారా రూ.889 కోట్లతో గిరిజన వర్సిటీ (Tribal University) ఏర్పాటు చేస్తున్నట్లు.. తద్వారా తెలంగాణలోని గిరిజనులకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. విశ్వవిద్యాలయం ద్వారా గిరిజనుల హక్కులు, సంస్కృతి పరిరక్షణకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. గిరిజన యూనివర్సిటీకి సమ్మక్క-సారక్కగా నామకరణం చేశామని.. కేంద్రం పసుపు బోర్డు ఏర్పాటు చేయడం సంతోషకరమని కిషన్​రెడ్డి వ్యాఖ్యానించారు.

"కృష్ణా జలాల్లో వాటా తేల్చాలని తెలంగాణ కోరుతోంది. కృష్ణా జలాల పంపిణీపై కేంద్రం, తెలంగాణ మధ్య చర్చలు జరిగాయి. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతోనే తెలంగాణ ఉద్యమం వచ్చింది. జల వివాదాలు పరిష్కరించిన కేంద్రానికి ధన్యవాదాలు." - కిషన్‌రెడ్డి, కేంద్ర మంత్రి

కృష్ణా జలాల్లో ఏపీ, తెలంగాణ వాటా తేల్చాలని ట్రైబ్యునల్‌కు కేంద్రం విజ్ఞప్తి చేసిందని.. కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్ పేర్కొన్నారు. కొత్త నిబంధనలు రూపొందించాలని ట్రైబ్యునల్‌కు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసినట్లు వివరించారు. కృష్ణా జలాల్లో తమ వాటా తేల్చాలని తెలంగాణ కోరుతోందని చెప్పారు. ప్రస్తుత, భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని జలాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కేంద్ర సర్కార్​ నిర్ణయంతో తెలంగాణ ఆకాంక్ష నెరవేరుతుందని అనురాగ్‌ ఠాకూర్ ఆకాక్షించారు.

Kishan Reddy about Krishna Water Sharing కేంద్ర నిర్ణయంతో కృష్ణా జలాల సమస్య పరిష్కారమవుతుందని ఆకాంక్షిస్తున్నా

Central Govt Focus on Krishna Water Share to AP and Telangana : 'కృష్ణా జలాల్లో తెలుగు రాష్ట్రాల వాటా త్వరగా తేల్చండి'

KRMB Meeting : దిల్లీకి చేరిన కృష్ణా జలాల వాటాల పంచాయితీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.