భూ రికార్డుల సర్వే కార్యక్రమం చేపట్టి ఇప్పటికి రెండు సంవత్సరాలు గడిచినా రైతుల ఇబ్బందులు తప్పలేదని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి విమర్శించారు. రైతులకు ఇంకా పట్టాపుస్తకాలు అందకపోవడం వల్ల తీవ్ర నష్టానికి గురి అవుతున్నారని పేర్కొన్నారు.
ప్రభుత్వం ఆదుకోకపోవడం వల్ల రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన విడుదల చేసిన ఓ ప్రకటనలో ప్రభుత్వ వైఖరిపై ధ్వజమెత్తారు. రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందని ఆరోపించారు. తెరాస నాయకులు ఇదే అదనుగా భావించి భూకబ్జాలకు పాల్పడుతున్నారని అన్నారు. చెరువు శిఖం భూములను కూడా ప్లాట్లు చేసి అమ్ముకుంటున్నారని మండిపడ్డారు. వీటిపై ముఖ్యమంత్రి దృష్టి వహించాలన్నారు.
ఇవీ చూడండి: పీపీఈ కిట్లపై నిర్లక్ష్యం.. జంతువుల పాలిట శాపం