ETV Bharat / state

రైతన్నను వీడని"ఖరీఫ్" కష్టాలు..!

రాష్ట్రంలో వర్షాధార పంటలకు చినుకు బెంగ పట్టుకుంది. వారం రోజులుగా వర్షాభావం పెరిగింది. ఖరీఫ్ సీజన్​లో ఆశాజనకంగా వర్షాలు కురిసినా  నాలుగో వంతు చెరువులు, చిన్న నీటి వనరులు కూడా నిండలేదు. 9 జిల్లాల్లో లోటు వర్షపాతం కొనసాగుతోంది. మరోవైపు పంట చేతికొచ్చే దశలో సరిగ్గా నీరందక దిగుబడి తగ్గేప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

రైతన్నను వీడని"ఖరీఫ్" కష్టాలు..!
author img

By

Published : Aug 17, 2019, 4:42 AM IST

Updated : Aug 17, 2019, 7:36 AM IST

రైతన్నను వీడని"ఖరీఫ్" కష్టాలు..!

వర్షాధార పంటలకు చినుకు బెంగ
కృష్ణా, గోదావరి నదుల్లో పుష్కలంగా వరద వస్తుండటం వల్ల జలాశయాలు నిండాయి. నీటి వనరులున్న ప్రాంతాల్లో పంటలకు ఢోకా లేదు. ఈ నెల 10 వరకూ విస్తారంగా వర్షాలు పడటం వల్ల పైర్లు కళకళలాడుతున్నాయి. గత ఐదు రోజులుగా వర్షాలు తగ్గిపోయాయి. మరో వారం రోజులు వర్షాలు లేకపోతే... పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం పడుతుందని జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు తెలిపారు.

పంటల సాగుపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న వర్షాలు
ప్రస్తుతం రుతు పవనాల కదిలికలు బలహీనంగా ఉన్నాయి. శనివారం నుంచి 3 రోజులపాటు భారీ వర్షాలు లేవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. అక్కడక్కడా తేలికపాటి వర్షాలు పడనున్నాయని తెలిపింది. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ఆరంభంలో వర్షాభావం, ఆ తర్వాత అధిక వర్షాలతో పంటల సాగుపై ప్రభావం పడింది.

తొమ్మిది జిల్లాల్లో 20 నుంచి 47 శాతం వర్షపాతం లోటు
రాష్ట్రంలో 46వేల 764 చెరువులు ఉండగా... వీటిలో 26వేల 196 చెరువుల్లో 25 శాతం లోపే నీరుంది. జూన్ 1 నుంచి ఇప్పటివరకు 9 జిల్లాల్లో వర్షపాతం లోటు 20 నుంచి 47 శాతం వరకు ఉంది. రాష్ట్రంలో మొత్తం సాగు విస్తీర్ణం 43.34 లక్షల హెక్టార్లు కాగా... ఖరీఫ్‌లో 80 శాతం అంటే 34.48 లక్షల హెక్టార్ల మేర రైతులు పంటలు వేశారని వ్యవసాయశాఖ తాజా నివేదికలో వెల్లడించింది.

వర్షాధార పంటలకు కష్టకాలం
ఈ సారి జూన్, జులైలో వర్షాలు లేనందున సాగు విస్తీర్ణం తగ్గడంతో పాటు వర్షాధార భూముల్లో వేసిన పంటలపై ప్రభావం చూపింది. పప్పుధాన్యాలు 16 శాతం, నూనెగింజల పంటలు సాధారణం కన్నా 25 శాతం తక్కువగా సాగయ్యాయి. ఆహార ధాన్యాల పంటల సాగు ఇప్పటి వరకూ 31 శాతం తక్కువగా ఉంది. వరి నాట్లు ఇంకా వేస్తున్నందున ఆహార ధాన్యాల సాగు విస్తీర్ణం పెరుగుతుందని అంచనా.

సాగు సమయం పూర్తైంది.. విస్తీర్ణం తగ్గింది
జిల్లాల వారీగా చూస్తే... కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, ఆదిలాబాద్, నిర్మల్‌లో మాత్రమే 100 శాతానికి మించి సాగు విస్తీర్ణంలో పంటలు వేశారు. 12 జిల్లాల్లో సాగు విస్తీర్ణం సాధారణంలో 51 నుంచి 75 శాతం వరకే ఉంది. రిజర్వాయర్లు, చెరువుల్లో నీరు పుష్కలంగా చేరుతున్నా ఇప్పటికే పలు పంటల సాగు సమయం పూర్తైనందున సాగు విస్తీర్ణం తక్కువగా ఉన్నట్లు వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది.

ఇవీ చూడండి: 'అలా చేస్తే 15 నిమిషాల్లోనే నిరసనలు బంద్'

Intro:Body:Conclusion:
Last Updated : Aug 17, 2019, 7:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.