పర్యావరణ పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాల గురించి నామ నాగేశ్వరరావు లోక్‌సభలో వివరించారు. ప్లాస్టిక్ నివారణ కోసం తెలంగాణ ప్రభుత్వం రెండు మహాత్తర కార్యక్రమాలను ప్రవేశపెట్టిందని తెలిపారు. ఒకటి గ్రామాల్లో 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక కాగా... మరొకటి ఒక కిలో ప్లాస్టిక్‌కు కిలో బియ్యంను ప్రవేశపెట్టినట్లు వివరించారు. ఫలితంగా తెలంగాణ త్వరలోనే ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా తయారవుతోందని ధీమా వ్యక్తం చేశారు.
ఇటీవల ప్రధాన మంత్రి మోదీ మహబలిపురంలో ఉదయపు నడకలో ప్లాస్టిక్‌ను తీసే వీడియో బాగా వైరల్ అయ్యిందని ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు లోక్‌సభలో గుర్తు చేశారు. కేంద్రం కూడా తెలంగాణలో ప్రవేశపెట్టిన పథకాలను అమలు చేయాలని నామ సూచించారు.