తెలంగాణ రాకుంటే ఎలా ఉండేదో ఇప్పుడు అర్థమవుతోందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఉద్యమ సమయంలో రాష్ట్ర ఏర్పాటుపై ఎన్నో అపోహలు ఉండేవని గుర్తు చేసుకున్నారు. ఈ విధంగా తెలంగాణను అభివృద్ధి చేయొచ్చనే ఆలోచన రానందుకు అప్పటి సభలో సభ్యుడిగా ఉన్నందుకు సిగ్గుతో తలవంచుకుంటున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ శాఖలో లోపాలను సవరించాలని... ధరణి రికార్డుల్లో పూర్తిస్థాయిలో వివరాలు నమోదు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. 58, 59 జీవో, బీఆర్‌ఎస్ పథకంపై ను పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో ఎన్నో ప్రజాసంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారు. దేశ చరిత్రలో కేసీఆర్ పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. రాష్ట్రంలో సంస్కరణలకు మారుపేరు కేసీఆర్. రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి.
- దానం నాగేందర్
ఇదీ చదవండి: కొత్త రెవెన్యూ చట్టంపై సీఎల్పీ నేత భట్టి, సీఎం కేసీఆర్ వాదనలు