జూబ్లీహిల్స్ డివిజన్ పరిధిలోని ఫిలిం ఛాంబర్ వద్ద సీసీ రోడ్డును... ఎమ్మెల్యే దానం నాగేందర్, స్థానిక కార్పొరేటర్ కాజా సూర్యనారాయణతో కలిసి ప్రారంభించారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో సుమారు రూ.80 కోట్ల వ్యయంతో వివిధ అభివృద్ధి పనులు పూర్తి చేసామని ఎమ్మెల్యే వెల్లడించారు.
రానున్న నెలరోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులకు నిధులు మంజూరయ్యాయన్నారు. కేసీఆర్ పాలనలోనే బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాయని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు.
ఇదీ చూడండి: ‘మర్డర్’ సినిమా నిలిపివేయాలంటూ మధ్యంతర ఉత్తర్వులు