రాష్ట్రంలో అంతరించిపోతున్న కుల వృత్తులకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి అన్నారు. రాష్ట్ర వీరశైవ లింగాయత్ - లింగ బలిజ సంఘం గ్రేటర్ హైదరాబాద్ శాఖ ఆధ్వర్యంలో లక్డీకపూల్‌లోని వాసవీ కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు.
ఇంత వరకు ఏ ముఖ్యమంత్రి అమలు చేయని అనేక సంక్షేమ పథకాలను రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు పరుస్తున్నారని కార్పొరేటర్ విజయారెడ్డి అన్నారు. కుల సంఘాల అభివృద్ధి కోసం నిధులు కేటాయించడంతో పాటుగా.. ఆత్మగౌరవ భవనాలను కూడా నిర్మిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లింగాయత్ సంఘం రూపొందించిన క్యాలెండర్‌ను సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పటోల్లో సంగమేశ్వర్, హైదరాబాద్ అధ్యక్షుడు రాచప్పతో కలిసి ఆమె ఆవిష్కరించారు. లింగాయత్ సంఘం సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: పాస్‌వర్డ్ మరిచిపోయాడు..! రూ.1800 కోట్లు పోగొట్టుకున్నాడు.!