సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ డిమాండ్ చేశారు. రాష్ట్రప్రభుత్వం జీతాలు పెంచకుండా శ్రమదోపిడి చేస్తోందన్నారు. కేజీబీవీల్లో పనిచేస్తున్న నాన్‌టీచింగ్ మహిళా ఉద్యోగులు వేతనాలు పెంచాలంటూ ధర్నాకు దిగారు. హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన ఆందోళనలో ఆయన పాల్గొన్నారు.
పనికి తగిన వేతనం ఇవ్వాలని.. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయని ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేయాలని తెలిపారు. తెలంగాణ ధనిక రాష్ట్రమని చెప్పే ముఖ్యమంత్రి కేజీబీవీల్లో పనిచేస్తున్న మహిళ ఉద్యోగులపై ఎందుకు వివక్ష చూపుతున్నారని ప్రశ్నించారు. ఏపీలో ఇప్పటికే రెండుసార్లు జీతాలు పెరిగాయని.. కానీ మనరాష్ట్రంలో కేజీబీవీ ఉద్యోగుల జీతాలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయని ప్రొఫెసర్ నాగేశ్వర్ విమర్శించారు.