తెలంగాణ భవన్లో 74వ స్వాతంత్య్ర వేడుకలను నిరాడంబరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెరాస సెక్రెటరీ జనరల్ కె.కేశవరావు ప్రొ.జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి.. రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రత్యేక రాష్టం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం అన్ని రంగాలను అభివృద్ధి చేస్తోందని కేశవరావు పేర్కొన్నారు. రాష్ట్రంలో అమలవుతున్నన్ని సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడా లేవని తెలిపారు. కరోనా దృష్ట్యా ప్రజలంతా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పలువురు తెరాస నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇదీచూడండి: ప్రగతిభవన్లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి కేసీఆర్