ETV Bharat / state

'ఎంపీ అర్వింద్​ను ఎన్నికల ప్రచారం నుంచి తప్పించండి'

ఎస్​ఈసీకి నిజామాబాద్ ఎంపీ అర్వింద్​పై తెరాస నేతలు ఫిర్యాదు చేశారు. జీహెచ్​ఎంసీ ఎన్నికల ప్రచారం నుంచి ఎంపీని తప్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ఎన్నికల కమిషనర్​ పార్థసారథిని కలిశారు.

'ఎంపీ అర్వింద్​ను ఎన్నికల ప్రచారం నుంచి తప్పించండి'
'ఎంపీ అర్వింద్​ను ఎన్నికల ప్రచారం నుంచి తప్పించండి'
author img

By

Published : Nov 25, 2020, 5:33 PM IST

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్​ను జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం నుంచి తప్పించి, ఆయనపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని తెరాస కోరింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథిని కలిసిన తెరాస ప్రతినిధుల బృందం... ఈ మేరకు అర్వింద్​పై ఫిర్యాదు చేసింది.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో హింసను ప్రేరేపించాలని భాజపా చూస్తోందన్న నేతలు... నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

బండి సంజయ్, అర్వింద్​లు పార్లమెంట్ సభ్యుల్లా వ్యవహరించడం లేదన్నారు. మంత్రి పేరిట ప్రజలకు రెచ్చగొట్టి ఎన్నికల్లో గెలవాలని భాజపా చూస్తోందని ఆరోపించారు. సౌత్​ను నార్త్​లా మారుస్తామంటున్న భాజపా... తెలంగాణను బిహార్, ఉత్తర్​ప్రదేశ్​లా మారుస్తారా అని ప్రశ్నించారు.

ఇదీ చూడండి: అక్బరుద్దీన్ వ్యాఖ్యలను ఖండించిన కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.