ETV Bharat / state

'కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమష్ఠి కృషితో మెరుగైన వైద్యం సాధ్యం'

kcr-video-conference-with-pm-modi
ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్​ దృశ్యమాధ్యమ సమీక్ష
author img

By

Published : Aug 11, 2020, 1:58 PM IST

Updated : Aug 11, 2020, 4:21 PM IST

13:57 August 11

ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్​ దృశ్యమాధ్యమ సమీక్ష

'కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమష్ఠి కృషితో మెరుగైన వైద్యం సాధ్యం'

వివిధ రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. సమీక్షలో ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్, మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​కుమార్​తోపాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, ప్రస్తుత పరిస్థితులపై కేసీఆర్​ మోదీకి వివరించారు. కరోనా అనుభవాల దృష్ట్యా దేశంలో వైద్య సదుపాయాలపై దృష్టి పెట్టాలని సీఎం తెలిపారు. దేశంలో వైద్య సదుపాయాలు పెంచాల్సిన అవసరాన్ని కరోనా గుర్తుచేసిందని ముఖ్యమంత్రి అభివర్ణించారు.  

రాష్ట్రంలో రికవరీ రేటు 71 శాతం, మరణాలు రేటు 0.7 శాతం ఉందని తెలిపారు. కోవిడ్ నిర్ధరణ పరీక్షల సంఖ్యను గణనీయంగా పెంచామని ముఖ్యమంత్రి చెప్పారు. కరోనా సోకిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని, కావల్సినన్ని పడకలు, ఔషధాలు, ఇతర పరికరాలు, సామాగ్రి సిద్ధంగా ఉంచామని అన్నారు. ఐసీఎంఆర్, నీతి ఆయోగ్, కేంద్ర బృందాల సలహాలు పాటిస్తున్నామన్న కేసీఆర్... వైద్య సిబ్బంది, పోలీసు సిబ్బంది, ఇతర ప్రభుత్వ యంత్రాంగం అంతా శక్తి వంచన లేకుండా పని చేస్తోందని వివరించారు. 

గతంలో అనేక వైరస్​లు సోకినప్పటికీ కరోనా లాంటి వాటిపై అనుభవం లేదని.. ఇప్పటి విపత్కర పరిస్థితులు మనకెన్నో పాఠాలు నేర్పిస్తున్నాయని సీఎం మోదీతో అన్నారు. కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు కలిసి సమగ్ర వైద్య సదుపాయాల కోసం ప్రణాళికను రూపొందించాలని సీఎం సూచించారు. కొవిడ్ లాంటి వైరస్​లు భవిష్యత్తులో వచ్చినా తట్టుకునేలా వైద్యరంగం తయారుకావాలన్నారు. ఐఎంఏ సలహాలతో జనాభా నిష్పత్తి ప్రకారం వైద్యులు, వైద్య కళాశాలల ఏర్పాటుపై ఆలోచించాలని మోదీకి కేసీఆర్ వివరించారు. 

Last Updated : Aug 11, 2020, 4:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.