KCR- The Book of Millions: దేశాభివృద్ధికి కొత్త లక్ష్యాలు నిర్దేశించుకోవాలని సీఎం కేసీఆర్ చెప్పారని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ పాలన దేశంలోని చాలా రాష్ట్రాలపై ముద్ర వేసిందన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస ప్రాంగణంలో మంత్రి జగదీశ్ రెడ్డి.. కేసీఆర్- ది మ్యాన్ ఆఫ్ మిలియన్స్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ పుస్తకాన్ని రాసినట్లు రచయితలు వెల్లడించారు.
కేసీఆర్ విజన్‌ను రచయిత జూలూరి గౌరీ శంకర్ 'ఒక్కగానొక్కడు' పుస్తకంలో చక్కగా ఆవిష్కరించారని.. దాన్ని మంతెన దామోదరా చారి ఇంగ్లీషులోకి అనువదించారని మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ఉద్యమం జరిగిన తీరు.. రాష్ట్రం ఏర్పడేందుకు కేసీఆర్ అనుసరించిన విధానం, చిక్కుముళ్లను ఎలా ఎదుర్కొన్నారనే అంశాలను పుస్తకంలో రచయిత వివరంగా చెప్పారని జగదీశ్‌రెడ్డి తెలిపారు.
"రాష్ట్రం ఏర్పడిన తర్వాత చాలా మంది మీకు పాలించడం చేతకాదన్నారు. సీఎం కేసీఆర్ వాటన్నింటినీ తిప్పికొట్టి... తెలంగాణను గొప్ప పరిపాలన కేంద్రంగా మార్చారు. ఈ పుస్తకం చాలా మందికి ఉపయోగడుతుందని ఆశిస్తున్నాను. కేసీఆర్ ఏంటి అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు... ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికల సమయంలో అమలు చేస్తున్నారు." -జగదీశ్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి
ఇదీ చదవండి: CM KCR Mumbai Tour schedule : ఈనెల 20న ముంబయికి సీఎం కేసీఆర్.. ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ..