హక్కుల కోసం ఆర్టీసీ కార్మికులు కలిసికట్టుగా ఉద్యమం చేయడం శుభ పరిణామమని సీఐటీయూ అఖిల భారత ఉపాధ్యక్షుడు పద్మనాభన్ తెలిపారు. కేంద్ర కార్మిక మంత్రిగా పని చేసిన కేసీఆర్కు కార్మిక చట్టాల గురించి తెలియకపోవడం దారుణమన్నారు. సెల్ఫ్ డిస్మిస్ అనే పదం రాజ్యాంగంలోనే లేదని చెప్పారు. కేసీఆర్ బ్రిటిష్ రాజు లాగా వ్యవహరిస్తున్నారని.. ఆర్టీసీ ఉద్యమానికి రాజకీయ పార్టీలు కలిసి రావడం పట్ల పద్మనాభన్ హర్షం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం మూర్ఖంగా వ్యవహరిస్తోందని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పోరాటం కొనసాగిస్తామని ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి స్పష్టం చేశారు. ఆర్టీసీ ఐకాసను విచ్చిన్నం చేయాలని కేసీఆర్ కుట్ర పన్నుతున్నారని ఐకాస సహ కన్వీనర్ రాజిరెడ్డి మండిపడ్డారు. ప్రజా రవాణాను ప్రైవేటీకరించే దిశగా కేసీఆర్ చేస్తున్న ఆలోచనకు నిరుద్యోగులు సహకరించొద్దని రాజిరెడ్డి కోరారు.
ఇవీ చూడండి : చరిత్రే చిన్నబోతోంది... ఆ రణభూమికి ఇప్పుడేమైంది!?