యాసంగి పంటకు రైతుబంధు నిధుల విడుదల, పంపిణీపై సీఎం కేసీఆర్ ఇవాళ నిర్ణయం తీసుకోనున్నారు. కరోనా కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా ఆదాయం పడిపోయినప్పటికీ.. వానాకాలంలో రైతులందరికీ రైతుబందు సాయాన్ని అందించారు. 7200 కోట్ల రూపాయల మేర రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు.
తాజాగా యాసంగి పంట రైతుబంధు సాయం విషయమై ముఖ్యమంత్రి ఇవాళ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. వ్యవసాయశాఖ మంత్రి, సీఎస్ సోమేశ్ కుమార్, వ్యవసాయ, ఆర్థిక శాఖ కార్యదర్శులు, ఉన్నతాధికారులతో కేసీఆర్ మధ్యాహ్నం సమావేశం కానున్నారు. పరిస్థితులను సమీక్షించి రైతుబంధు సాయం నిధుల విడుదల, పంపిణీపై ముఖ్యమంత్రి నిర్ణయం ప్రకటించనున్నారు.
ఇదీ చూడండి : రాష్ట్రంలో తొలివిడతలో 70-75లక్షల మందికి టీకా