తెరాస సభ్యత్వ నమోదు జోరుగా సాగాలని, ఈ నెల 20న తుది గడువు వరకు పెద్దఎత్తున పార్టీలో ప్రజలను చేర్పించాలని... పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ నాయకులకు సూచించారు. ప్రతి నియోజకవర్గంలోనూ లక్ష్యాలను సాధించాలని నిర్దేశించారు. గత నెల 27 నుంచి పార్టీ సభ్యత్వ నమోదు సాగుతోంది. సభ్యత్వ నమోదు తీరును సీఎం కేసీఆర్ గత రెండు రోజులుగా స్వయంగా ఆరా తీస్తున్నారు. పార్టీ ప్రతినిధులు, నేతలకు ఫోన్లు చేసి వివరాలు తెలుసుకుంటున్నారు. సభ్యత్వ నమోదు ఎలా సాగుతోంది? పార్టీ శ్రేణులు ఎలా పనిచేస్తున్నాయి? ప్రజా స్పందన ఎలా ఉందనే అంశాలపై సమాచారం సేకరించారు. మరింత ఉత్సాహంగా సభ్యత్వ నమోదుల్లో పాల్గొనాలని నేతలకు సీఎం సూచించారు. చివరి వరకు దీనిపైనే దృష్టి సారించాలన్నారు.
ఇవీచూడండి: భాజపాలో చేరిన సోమారపు సత్యనారాయణ