సీఎం కేసీఆర్ ఇవాళ కలెక్టర్లతో సమావేశం కానున్నారు. హైదరాబాద్ ప్రగతి భవన్లో ఉదయం 11 గంటలకు జిల్లా పాలనాధికారులతో భేటీ అవుతారు. గ్రామ పంచాయతీల్లో 30 రోజుల ప్రత్యేక ప్రణాళిక అమలు తీరును సమీక్షించనున్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, పచ్చదనం, గ్రామాభివృద్ధిపై 30 రోజుల్లో వచ్చిన మార్పును కలెక్టర్లను అడిగి తెలుసుకోనున్నారు.
ఆర్టీసీ సమ్మెపై
రాష్ట్రంలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మె పరిణామాలపై చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే ఆర్టీసీకి సంబంధించిన అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ చర్చించారు. ప్రభుత్వ ఆదేశాలనుసారం జిల్లా పాలనాధికారులు సమ్మె పరిణామాలను సమీక్షిస్తూ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులను డిప్యూటేషన్‌పై ఆర్టీసీలో నియమించారు.
ఇవీ చూడండి: "రేపటినుంచి పూర్తిస్థాయిలో బస్సులు నడిపేందుకు చర్యలు"