ETV Bharat / state

మీ సేవలకు పాదాభివందనం: ముఖ్యమంత్రి కేసీఆర్

కరోనా పోరులో తమ ప్రాణాలు సైతం లెక్కచేయకుండా.. పోరాడుతున్న వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది, పోలీసులకు ముఖ్యమంత్రి చేతులెత్తి నమస్కరించారు. ప్రభుత్వం వారందరినీ కడుపులో పెట్టుకుని చూసుకుంటుందని సీఎం భరోసా ఇచ్చారు. వైద్య, పారిశుద్ధ్య సిబ్బందికి ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్రకటించారు.

మీ సేవలకు పాదాభివందనం: ముఖ్యమంత్రి కేసీఆర్
మీ సేవలకు పాదాభివందనం: ముఖ్యమంత్రి కేసీఆర్
author img

By

Published : Apr 7, 2020, 5:55 AM IST

కష్టంలో కన్నీళ్లు పంచుకునే వారే ఇప్పుడు కావాలని ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు సందేశమిచ్చారు. ఒకరికొకరు ధైర్యం, ప్రోత్సాహం ఇచ్చుకోవాలని... నిరంతరం శ్రమిస్తున్న వైద్య సిబ్బందికి పొగిడే నోళ్లు కావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన వారికోసం 8 ఆసుపత్రులు నోటిఫై చేశామని కేసీఆర్ తెలిపారు. 25వేల మంది అదనపు వైద్య సిబ్బంది సిద్ధంగా ఉన్నారని సీఎం పేర్కొన్నారు. తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పనిచేస్తున్న వైద్య సిబ్బందికి ప్రోత్సాహకం అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.

ఇదే స్ఫూర్తితో పనిచేయండి..

ఐసోలేషన్‌ కేంద్రాలు మొదలుకొని ప్రతి వీధి, వాడలో అవసరమైన రసాయలను పిచికారీ చేస్తూ అద్దంలా ఉంచుతున్నారని.. పారిశుద్ధ్య కార్మికులకు ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులకూ.. ప్రోత్సాహకం అందిస్తామని.. వారు ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ముఖ్యమంత్రి కోరారు.

పోలీసులకూ... త్వరలో నిర్ణయం

పోలీసులు, ఇంటెలిజెన్స్‌ బృందాలు అద్భుతంగా పనిచేస్తున్నాయని... మర్కజ్‌ వెళ్లిన వారిలో చాలామందిని వారే గుర్తించారని సీఎం ప్రశంసించారు. పోలీసులకు ప్రోత్సాహకం గురించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి వెల్లడించారు.

ఇవీచూడండి: 'దేశంలో కరోనా కేసులు, మృతుల్లో పురుషులే అధికం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.