ETV Bharat / state

KCR Nutrition Kit: త్వరలో రాష్ట్రవ్యాప్తంగా KCR న్యూట్రిషన్ కిట్ల పంపిణీ - KCR Nutrition Kit

KCR Nutrition Kit: తల్లి ఆరోగ్యమే బిడ్డకు శ్రీరామ రక్ష. గర్భిణులు ఆరోగ్యంగా ఉంటే.. కడుపులోని పిండం ఆరోగ్యంగా ఎదుగుతుందని అందుకోసం పౌష్టికాహారం తీసుకోవాలని వైద్యులు చెబుతుంటారు. కారణం ఏదైనా రాష్ట్రంలోని గర్భిణుల్లో పౌష్టికాహార లోపం ఉందని గుర్తించిన సర్కారు.. తల్లుల ఆరోగ్యం కోసం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్‌కి శ్రీకారంచుట్టింది. ఈ న్యూట్రిషన్ కిట్ల పంపిణీకి.. రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 6.84 లక్షల మంది గర్భిణులు లబ్ది పొందనున్నారు.

KCR Nutrition Kit
KCR Nutrition Kit
author img

By

Published : May 4, 2023, 11:42 AM IST

త్వరలో రాష్ట్రవ్యాప్తంగా KCR న్యూట్రిషన్ కిట్ల పంపిణీ

KCR Nutrition Kit: రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ కార్యక్రమాన్ని విస్తరించి.. అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన దస్త్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవలే సంతంకం చేసి ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రంలోని గర్భిణీల్లో మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని వారిలో రక్తహీనత అధికంగా ఉందని గతంలో పలు అధ్యయనాల్లో తేలింది. గర్భిణుల్లో పోషకాహార లోపం అధిగమించేందుకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అందించాలని సర్కార్ నిర్ణయించింది.

గతేడాది డిసెంబర్‌లో కామారెడ్డి కలెక్టరేట్ వేదికగా వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా 9 జిల్లాల్లో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల పంపిణీని సర్కారు ప్రారంభించింది. రక్తహీనత అధికంగా ఉన్న 9 జిల్లాల్లో తొలుత కిట్‌ల పంపిణీకి శ్రీకారం చుట్టింది. దాదాపు రూ.50కోట్ల ఖర్చుతో ఆదిలాబాద్, భద్రాద్రి, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ, కామారెడ్డి, కుమురం భీం, ములుగు, నాగర్‌కర్నూల్ , వికారాబాద్ జిల్లాల్లోని 1.25 లక్షల మంది గర్భిణులకు కేసీఆర్ కిట్లు పంపిణీ చేశారు.

తాజా నిర్ణయంతో మిగతా 24 జిల్లాల్లో న్యూట్రిషన్ కిట్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రోటీన్స్‌, మిన‌ర‌ల్స్‌, విట‌మిన్స్, ఐరన్‌ల‌ను పోష‌కాహారం ద్వారా అందించి.. ర‌క్తహీన‌త త‌గ్గించ‌డం, హీమోగ్లోబిన్ శాతం పెంచ‌డమే ఆ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాలో 6.84 లక్షల మంది గర్భిణులకు 1,046 కేంద్రాల ద్వారా...13.08 లక్షల కేసీఆర్‌ కిట్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

ప్రతిగర్భిణీకి రెండుసార్లు కిట్‌: ప్రతిగర్భిణీకి రెండుసార్లు కిట్‌ను అందించనున్నారు. 14 నుంచి 26 వారాల మధ్య జరిగే రెండో ఏఎన్‌సీ చెకప్‌ సమయంలో ఒకసారి, 27నుంచి 34 వారాల మధ్య చేసే మూడో ఏఎన్‌సీ చెకప్‌ సమయంలో రెండోసారి ఆ కిట్లు ఇవ్వనున్నారు. ఒక్కో కిట్ విలువ దాదాపు రూ.2000 .. అంటే 13.8 లక్షల కిట్లకు గాను సుమారు రూ.277 కోట్లు ఖర్చువుతుందని ఇప్పటికే సర్కారు అంచనా వేసింది.

మాతా శిశు సంరక్షణకు మరింత కృషి: ప్రతికిట్‌లో కిలోన్యూట్రిష్‌ మిక్స్‌పౌడర్, కేజీ ఖ‌ర్జూర‌, 3 ఐరన్ సిరప్‌సీసాలు, 500 గ్రాములనెయ్యి, ఒకకప్పు, 200 గ్రాముల పల్లిపట్టిని ప్లాస్టిక్ బాస్కెట్‌లో ఉంచి అందిచనున్నారు. ప్రత్యేకరాష్ట్రం ఏర్పడే నాటికి.. రాష్ట్రంలో మాతృమరణాల రేటు 92 ఉండగా ఆసంఖ్యను సర్కారు 43కి తగ్గించింది. అయితే గర్భిణుల్లో పౌష్టికాహార లోపాన్ని జయిస్తే.. ఎమ్‌ఎమ్‌ఆర్ రేటును మరింత తగ్గించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలు పెంచే లక్ష్యంతో కేసీఆర్‌కిట్ పథకాన్ని ప్రవేశపెట్టి విజయం సాధించిన సర్కార్.. న్యూట్రిషన్ కిట్ ద్వారా గర్భిణీలకు అండగా నిలవనున్నట్టు ప్రకటించంది. మాతా శిశు సంరక్షణకు మరింత కృషి చేస్తున్నామని స్పష్టంచేసింది.

ఇవీ చదవండి: Bandi Sanjay: తక్షణమే వారిని రెగ్యులరైజ్ చేయండి.. సీఎం కేసీఆర్​కు బండి సంజయ్ లేఖ

'బజరంగ్​ దళ్​ నిషేధంపై వెనక్కి తగ్గేదే లే.. ఛత్తీస్​గఢ్​లో కూడా..'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.