దిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ట్రంప్‌కు గౌరవార్థం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ విందు ఇచ్చారు. తొలిసారిగా భారత రాష్ట్రపతి భవన్‌కు విచ్చేసిన ట్రంప్ దంపతులకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దంపతులు ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం కాసేపు మాటామంతి నిర్వహించారు.
విందుకు హాజరైన కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలను ట్రంప్ పరిచయం చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కరచాలనం చేశారు. కేసీఆర్ తనను తాను ట్రంప్‌కు పరిచయం చేసుకున్నారు.