ETV Bharat / state

CM KCR: ఆ ముగ్గురిని కలిశాకే హైదరాబాద్​కు సీఎం కేసీఆర్​! - తెలంగాణ వార్తలు

ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా, జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌లను కలిసిన తర్వాతే సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌ వెళ్లనున్నట్లు సమాచారం.  ఈ ముగ్గురు అపాయింట్‌మెంట్లను సీఎంవో ఇప్పటికే కోరింది. పలు అంశాలపై జల్​శక్తి మంత్రి గజేంద్రసింగ్​ షెకావత్​తో చర్చించేందుకు ముందస్తుగా పలువురు నిపుణులు, అధికారులతో సీఎం భేటీ అయ్యారు.

CM KCR: ఆ ముగ్గురిని కలిశాకే హైదరాబాద్​ సీఎం కేసీఆర్​!

author img

By

Published : Sep 3, 2021, 5:24 AM IST

Updated : Sep 3, 2021, 6:17 AM IST

ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా, జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌లను కలిసిన తర్వాతే సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌ వెళ్లనున్నట్లు సమాచారం. ఈ ముగ్గురు అపాయింట్‌మెంట్లను సీఎంవో ఇప్పటికే కోరింది. వీలైతే ప్రధానమంత్రి, జల్‌శక్తి మంత్రులను శుక్రవారమే కలిసే అవకాశం ఉంది. ఆ తర్వాత అమిత్‌ షాను కలుస్తారని తెలిసింది. ముగ్గురిని కలిసిన అనంతరం ఆదివారం ముఖ్యమంత్రి దిల్లీ నుంచి హైదరాబాద్‌కు తిరుగుపయనమవుతారని పార్టీ వర్గాల సమాచారం.

నిపుణులతో కేసీఆర్​ భేటీ

కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిపై జారీ చేసిన గెజిట్​, వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై జల్​శక్తి మంత్రి గజేంద్రసింగ్​ షెకావత్​తో చర్చించేందుకు ముందస్తుగా పలువురు నిపుణులు, అధికారులతో సీఎం గురువారం రాత్రి తన నివాసంలో సమావేశమయ్యారు. ఆయా అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ వాదనలు మంత్రి వద్ద బలంగా వినిపించాలని సమావేశంలో చర్చించినట్లు తెలిసింది.

ఇదీ చదవండి: KTR: ఐటీఐఆర్​ పథకాన్ని పునరుద్ధరించండి.. కేంద్రమంత్రికి కేటీఆర్​ విజ్ఞప్తి

Last Updated : Sep 3, 2021, 6:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.