ETV Bharat / state

KCR on Dharani Portal : 'ధరణి ద్వారా యజమానులు మాత్రమే భూమిని ఇతరులకు మార్చగలరు'

KCR on Dharani Portal : ధరణి పోర్టల్‌ తెచ్చి భూములను డిజిటలైజేషన్‌ చేశామని.. ప్రతిపక్షాలు ఆరోపించినట్లు ఇందులో ఎలాంటి అవకతవకలు జరగవని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ పోర్టల్ ద్వారా యజమానులు మాత్రమే భూమి ఇతరులకు మార్చగలరని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టుల పుణ్యమా భూములు విలువ భారీగా పెరిగాయని కేసీఆర్ వివరించారు. రూ.80,000 కోట్లు పెట్టి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు అప్పు ఎప్పుడో తీరిందని కూడా ఆయన తెలిపారు.

kcr
kcr
author img

By

Published : Jul 24, 2023, 8:33 PM IST

Updated : Jul 24, 2023, 9:46 PM IST

KCR Interesting Comments on Dharani Portal : హైదరాబాద్ ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో.. భువనగిరి డీసీసీ అధ్యక్షుడు అనిల్‌కుమార్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరారు. సీఎం.. ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. భారత్ రాష్ట్ర సమితి ఒక లక్ష్యంతో ఏర్పాటైన పార్టీ అని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే అవమానాలు, అవహేళనలు ఎదుర్కొని నిలబడ్డామని.. పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్నామని చెప్పారు. తెలంగాణ రాకముందు విద్యుత్‌ లేక.. పొలాలు ఎండిపోయేవని కేసీఆర్ గుర్తుచేశారు.

KCR on Dharani Portal : ప్రస్తుతం 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని.. దేశంలో ఎక్కడా లేని విధంగా కరెంట్ ఇస్తున్నామని కేసీఆర్ పేర్కొన్నారు. మరోవైపు కాంగ్రెస్ 3 గంటల విద్యుత్ అంటే రైతులు తిట్టుకుంటున్నారని చెప్పారు. 24 గంటలు కరెంట్ ఇస్తే ఎవరికి అవసరమైనప్పుడు వారు వాడుకుంటారని వివరించారు. తలసరి ఆదాయంలో దేశంలోనే ప్రథమస్థానంలో ఉన్నామని తెలిపారు. రూ.80,000 కోట్లు పెట్టి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు అప్పు ఎప్పుడో తీరిందని కేసీఆర్ వెల్లడించారు.

KCR Latest News : రాష్ట్రంలో వ్యవసాయరంగం అద్భుతంగా ఉందని కేసీఆర్‌ పేర్కొన్నారు. ధరణి పోర్టల్‌ తెచ్చి భూములను డిజిటలైజేషన్‌ చేశామని.. తద్వారా యజమానులు మాత్రమే భూమి ఇతరులకు మార్చగలరని వివరించారు. తెలంగాణలో భూములు విలువ భారీగా పెరిగాయని.. రైతుల పరిస్థితి మెరుగుపడిందని చెప్పారు. ధరణి ద్వారా నేరుగా రైతుల ఖాతాల్లోకి నగదు జమ అవుతుందని.. దీనిని తీస్తే రైతుబంధు నిధులు ఎలా జమ అవ్వాలని కేసీఆర్‌ ప్రశ్నించారు. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో 76 మంది మహారాష్ట్ర సర్పంచ్‌లు బీఆర్ఎస్‌లో చేరారు.

"ప్రస్తుతం 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యుత్‌ అందిస్తున్నాం. 3 గంటల విద్యుత్ అంటే రైతులు తిట్టుకుంటున్నారు. 24 గంటలు విద్యుత్‌ ఇస్తే ఎవరికి అవసరమైనప్పుడు వారు వాడుకుంటారు. తలసరి ఆదాయంలో దేశంలోనే ప్రథమస్థానంలో ఉన్నాం.రూ.80,000 కోట్లు పెట్టి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు అప్పు ఎప్పుడో తీరింది. రాష్ట్రంలో వ్యవసాయరంగం అద్భుతంగా ఉంది. ధరణి పోర్టల్‌ తెచ్చి భూములను డిజిటలైజేషన్‌ చేశాం. ధరణి ద్వారా యజమానులు మాత్రమే భూమి ఇతరులకు మార్చగలరు. రాష్ట్రంలో భూములు విలువ భారీగా పెరిగాయి." - కేసీఆర్‌, ముఖ్యమంత్రి

రాష్ట్రంలో భూములు విలువ భారీగా పెరిగాయి

ఇవీ చదవండి : CM KCR Speech at Asifabad Public Meeting : ''ధరణి​'ని తీసేస్తే మళ్లీ పైరవీకారులు, లంచగొండుల రాజ్యం'

CM KCR Asifabad Tour : 'ఆదివాసీల మీద ఉన్న పోడుభూముల కేసులన్నీ రద్దు చేస్తాం'

Last Updated : Jul 24, 2023, 9:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.