ETV Bharat / state

అదానీ వ్యవహారంపై పార్లమెంట్​లో సమాధానం చెప్పి తీరాలి: కేసీఆర్‌

KCR Comments on Central Government: కేంద్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. వ్యాపారం ప్రభుత్వ విధానం కాదని మోదీ చెప్తున్నారు.. కానీ ప్రభుత్వం ఎందుకు వ్యాపారం చేయకూడదని ప్రశ్నించారు. ప్రైవేటీకరణ పేరుతో ప్రభుత్వ సంస్థలను అమ్ముతున్నారని మండిపడ్డారు. దేశప్రగతి కోసం అవుట్‌ ఆఫ్‌ బాక్స్‌ ఆలోచనలు కావాలని కేసీఆర్‌ పేర్కొన్నారు.

KCR
KCR
author img

By

Published : Feb 5, 2023, 7:39 PM IST

KCR Comments on Central Government: సాధారణ వ్యాపారి అదానీ.. రెండేళ్లల్లోనే ప్రపంచ కుబేరుల్లో మూడో స్థానానికి ఎలా ఎదిగారని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు. ప్రధాని మిత్రుడైన అదానీ అంత వేగంగా ఎలా ఎదిగారని పేర్కొన్నారు. అదానీ కంపెనీల్లో ఎల్‌ఐసీ రూ.87,000 కోట్లు ఎందుకు పెట్టుబడి పెట్టాల్సి వచ్చిందని నిలదీశారు. అదానీ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. మహారాష్ట్రలోని నాందేడ్​లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

పార్లమెంట్​లో సమాధానం చెప్పి తీరాలి: అదానీ వ్యవహారంపై పార్లమెంట్​లో సమాధానం చెప్పి తీరాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. మనదేశంలో విధానపరంగా ఎన్నో లోపాలు ఉన్నాయని వెల్లడించారు. 6 లక్షల జనాభా ఉన్న సిక్కిం ఒక రాష్ట్రమే.. 25 కోట్ల జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్‌ ఒక రాష్ట్రమని అన్నారు. గోదావరి నది నుంచి ఏటా 2,000 నుంచి 3,000 టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తోందని వివరించారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో ఎన్నోసార్లు చర్చించి గోదావరిపై ప్రాజెక్టులు చేపట్టామని గుర్తు చేశారు.

దేశంలో ప్రతి ఎకరాకు సాగునీరు ఇవ్వొచ్చు: చిన్నచిన్న దేశాలు కూడా అద్భుత ప్రగతి సాధిస్తున్నాయని సీఎం కేసీఆర్‌ అన్నారు. అణుబాంబు దాడితో నష్టపోయిన జపాన్‌ అద్భుత ప్రగతి సాధించిందని గుర్తు చేశారు. దేశంలో గుణాత్మక మార్పు తీసుకురావడమే బీఆర్ఎస్ లక్ష్యమని పేర్కొన్నారు. దేశంలో ప్రజలకు సరిపడా సహజ వనరులు ఉన్నాయని తెలిపారు. దేశంలో ఏటా 1.40 లక్షల టీఎంసీల మేర వర్షం కురుస్తోందని.. సాగు కోసం 40 వేల టీఎంసీలు సరిపోతాయని వివరించారు. ప్రభుత్వం తలచుకుంటే దేశంలో ప్రతి ఎకరాకు సాగునీరు ఇవ్వొచ్చని ఆయన స్పష్టం చేశారు.

దేశప్రగతి కోసం అవుట్‌ ఆఫ్‌ బాక్స్‌ ఆలోచనలు కావాలి: 2004లో వేసిన బ్రిజేష్ ట్రైబ్యునల్‌ ఇప్పటివరకు నీటి వాటాలు తేల్చలేదని కేసీఆర్ పేర్కొన్నారు. ఇప్పటికీ రాష్ట్రాల మధ్య జల యుద్ధాలు ఎందుకని ప్రశ్నించారు. సరిపడా జలాలు ఉన్నా.. రాష్ట్రాలు ఎందుకు కొట్టుకుంటున్నాయని తెలిపారు భారీ రిజర్వాయర్ల నిర్మాణం గురించి కేంద్రం ఎందుకు ఆలోచించటం లేదని నిలదీశారు. దేశప్రగతి కోసం అవుట్‌ ఆఫ్‌ బాక్స్‌ ఆలోచనలు కావాలని కేసీఆర్‌ అన్నారు.

75 ఏళ్లు గడిచినా ఎన్నో విషయాల్లో భారత్ వెనకబడి ఉంది: దేశ జలవిధానం పూర్తిగా మారాలని కేసీఆర్ వివరించారు. మన దేశానికి 4.10 లక్షల మెగావాట్ల విద్యుత్‌ స్థాపిత సామర్థ్యం ఉందని వెల్లడించారు. అనేక రాష్ట్రాలు విద్యుత్ కొరతతో ఇబ్బంది పడుతున్నాయని చెప్పారు. దేశ రాజధాని దిల్లీలో కూడా నీరు, విద్యుత్‌ కొరత ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడిచినా ఎన్నో విషయాల్లో భారత్ వెనకబడి ఉందని అన్నారు. సమస్యల పరిష్కారం వదిలేసి మాటలతో కాలం గడుపుతున్నారని మండిపడ్డారు.

ప్రభుత్వం ఎందుకు వ్యాపారం చేయకూడదు: బీఆర్ఎస్​కు అధికారమిస్తే జలవిధానం పూర్తిగా మార్చేస్తామని కేసీఆర్ వివరించారు. దేశంలో కీలక ప్రాంతాల్లో భారీ నీటి ప్రాజెక్టులు నిర్మిస్తామని అన్నారు. వ్యాపారం ప్రభుత్వ విధానం కాదని మోదీ చెప్తున్నారు.. ప్రభుత్వం ఎందుకు వ్యాపారం చేయకూడదని ప్రశ్నించారు. ప్రైవేటీకరణ పేరుతో ప్రభుత్వ సంస్థలను అమ్ముతున్నారని ఆరోపించారు. లాభాల్లో ఉన్న ప్రభుత్వ సంస్థలను కూడా విక్రయించారని విమర్శించారు.

దేశంలో 24 గంటలు విద్యుత్‌ ఇచ్చే రాష్ట్రం తెలంగాణ: దేశంలో 360 టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని కేసీఆర్ అన్నారు. మనదేశ బొగ్గు నిల్వలతో 125 ఏళ్లపాటు దేశమంతటికి విద్యుత్ ఇవ్వొచ్చని తెలిపారు. విద్యుత్‌ రంగంలో ప్రైవేటు సంస్థలను ఎందుకు ప్రోత్సహిస్తున్నారని నిలదీశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక 90శాతం విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలు ప్రభుత్వం చేతుల్లోనే ఉంటాయని స్పష్టం చేశారు. దేశంలో 24 గంటలు విద్యుత్‌ ఇచ్చే రాష్ట్రం తెలంగాణ అని కేసీఆర్ పేర్కొన్నారు.

న్యూయార్క్‌, లండన్‌లో కరెంట్‌ పోవచ్చుగానీ.. హైదరాబాద్‌లో పోదని కేసీఆర్ స్పష్టం చేశారు. దేశంలో పుష్కలంగా బొగ్గు ఉండగా.. విదేశాల నుంచి ఎందుకు కొనాలని ప్రశ్నించారు. విదేశాల నుంచి బొగ్గు దిగుమతి వెనుక మతలబు ఏంటి? అని పేర్కొన్నారు. మహిళల ప్రాతినిధ్యం ఉన్న సమాజం అద్భుత ప్రగతి సాధిస్తుందని చెప్పారు. బీఆర్ఎస్ అధికారంలోకి చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని వివరించారు. చైనా నుంచి వెళ్లిపోతున్న కంపెనీలను భారత్ ఎందుకు ఆకర్షించటం లేదన్నారు. భారత్‌ ఆర్థిక వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. లాభాల్లో ఉన్న, ప్రపంచంలోనే అతిపెద్ద బీమా సంస్థ ఎల్‌ఐసీని ఎందుకు అమ్ముతున్నారని కేసీఆర్ ప్రశ్నించారు.

"సాధారణ వ్యాపారి అదానీ.. రెండేళ్లల్లోనే ప్రపంచ కుబేరుల్లో మూడో స్థానానికి ఎలా ఎదిగారు. ప్రధాని మిత్రుడైన అదానీ అంత వేగంగా ఎలా ఎదిగారు. అదానీ కంపెనీల్లో ఎల్‌ఐసీ రూ.87 వేల కోట్లు ఎందుకు పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది. అదానీ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ వేయాలి. అదానీ వ్యవహారంపై పార్లమెంటులో సమాధానం చెప్పి తీరాలి." -కేసీఆర్, సీఎం

అదానీ వ్యవహారంపై పార్లమెంట్​లో సమాధానం చెప్పి తీరాలి: కేసీఆర్‌

ఇవీ చదవండి: ఇది రాజకీయ పోరాటం కాదు.. జీవన్మరణ పోరాటం: కేసీఆర్

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్​.. డీఏ 4శాతం పెంపు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.