ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా సమస్యలను గాలికొదిలేసి... ప్రతిపక్షాలను తిట్టడానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ ఆరోపించారు. సీఎం ఉన్నవి లేనట్లుగా..లేనివి ఉన్నట్లుగా ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తాము సైతం నోటికొచ్చినట్లు మాట్లాడగలమని... కానీ తమకు సంస్కారం అడ్డొచ్చి ఆయన లాంటి భాషను వాడలేకపోతున్నామన్నారు.
కేసీఆర్ కాంగ్రెస్‌పై ఈ తరహ మాటలు మానుకోకపోతే... ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. కరోనా టెస్ట్‌లు ఎక్కువ చేస్తే బహుమతి ఇస్తారా అన్న కేటీఆర్ మాటలు బాధ్యతా రాహిత్యంగా ఉన్నాయన్నారు. కరోనా మహమ్మారిపై కాంగ్రెస్ ముందుగానే ప్రభుత్వాన్ని హెచ్చరించిందని... అయినా దానిని అంత తీవ్రంగా పరిగణించలేదని చెప్పారు. తమ శాఖలకు చెందిన అంశాలపై కేసీఆర్ అబద్ధాలు చెప్తుంటే హరీశ్, ఈటల మానసిక వేదనతో రగలి పోతున్నారని సంపత్ కుమార్ పేర్కొన్నారు.
ఇవీ చూడండి: కుటుంబసభ్యులతో ఆడుకున్న మంత్రి ఎర్రబెల్లి