KCR Comments on Central Government: చట్టసభల్లో ప్రజా సమస్యలపై చర్చలు జరగాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఇటీవల చట్టసభల్లో పెడ ధోరణులు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటులోనూ అవాంఛనీయ ధోరణులు కనిపిస్తున్నాయని వివరించారు. చట్టసభలు నడిచే ధోరణిపై చర్చ జరగాలని.. ఇలాంటి వాటిని నివారించాలని అన్నారు. కేంద్రం రాష్ట్రంపై వివక్ష చూపుతోందని మండిపడ్డారు. 150 నర్సింగ్ కాలేజీలు కేటాయిస్తే.. రాష్ట్రానికి ఒక్కటీ రాలేదని ఆరోపించారు. ఎన్నో వైద్య కళాశాలలు మంజూరు చేసినా మనకు ఒక్కటీ ఇవ్వలేదని కేసీఆర్ దుయ్యబట్టారు.
ఈటల రాజేందర్ ప్రస్తావించిన సమస్యలు పరిష్కరిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. సమస్యలు ఎవరు చెప్పినా సానుకూలంగా స్పందిస్తామని వివరించారు. తెలంగాణకు రావాల్సిన సొమ్ములు ఏపీ ఖాతాలో వేశారని గుర్తు చేశారు. తెలంగాణకు సొమ్ములు ఇప్పించడంలో ఏడేళ్ల జాప్యమా అని ప్రశ్నించారు. కేంద్రం నుంచి ఎలాంటి సహకారం ఉండట్లేదని ఆరోపించారు. కేంద్రం.. ఏమీ చేయం.. ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టు వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
దేశ పౌరసత్వాన్ని వదులుకునే దౌర్భాగ్యం ఎందుకు?: గతంలో కిరణ్‌కుమార్ రెడ్డి అసెంబ్లీలో అదే తరహాలో మాట్లాడారని కేసీఆర్ గుర్తు చేశారు. దేశ రాజధాని దిల్లీలోనూ తాగునీటికి దిక్కులేదని పేర్కొన్నారు. రత్నగర్భల్లాంటి దేశంలో కనీస అవసరాలు తీరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికాలో గ్రీన్‌కార్డు వస్తే పండుగ చేసుకునే పరిస్థితి నెలకొందని వివరించారు. 8 ఏళ్లలో 20 లక్షల మంది భారతీయ పౌరసత్వం వదులుకున్నారని అన్నారు. దేశ పౌరసత్వాన్ని వదులుకునే దౌర్భాగ్యం ఎందుకని కేసీఆర్ ప్రశ్నించారు.
ఎన్నికల్లో పార్టీలు, నేతలు గెలుస్తున్నారని.. ప్రజలు ఓడుతున్నారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. మన్మోహన్ సింగ్ మంచి వ్యక్తి.. పని ఎక్కువ.. ప్రచారం తక్కువని గుర్తు చేశారు. మన్మోహన్ సింగ్.. మోదీ కంటే ఎక్కువ మంచి పనులు చేశారని వివరించారు. మన్మోహన్, మోదీ పాలనపై పూజామెహ్రా 'ద లాస్ట్ డెకేడ్' పుస్తకం రాశారని తెలిపారు. మన్మోహన్ సింగ్ పాలనతో పోలిస్తే మోదీ హయాంలో దేశం ఘోరంగా దెబ్బతిన్నదని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
"ఎన్నికల్లో పార్టీలు, నేతలు గెలుస్తున్నారు.. ప్రజలు ఓడుతున్నారు. మన్మోహన్ సింగ్ మంచి వ్యక్తి.. పని ఎక్కువ.. ప్రచారం తక్కువ. మన్మోహన్ సింగ్.. మోదీ కంటే ఎక్కువ మంచి పనులు చేశారు. మన్మోహన్, మోదీ పాలనపై పూజామెహ్రా 'ద లాస్ట్ డెకేడ్' పుస్తకం రాశారు. మన్మోహన్ పాలనతో పోలిస్తే మోదీ హయాంలో దేశం ఘోరంగా దెబ్బతిన్నది." - కేసీఆర్, సీఎం
ఇవీ చదవండి: 2 లక్షల జనాభాకు ఒక మార్కెటైనా ఏర్పాటు చేయాలనేది లక్ష్యం: సీఎం కేసీఆర్
విద్వేష రాజకీయాలను తెలంగాణలోకి రానివ్వకూడదు: భట్టి విక్రమార్క
పగలు డెలివరీ బాయ్.. రాత్రి సెక్యూరిటీగార్డ్.. భిక్షాటన మానేసి కుటుంబాన్ని పోషిస్తున్న దివ్యాంగుడు