ETV Bharat / state

'నిరుద్యోగుల శాపం తగులుతుంది' - కేసీఆర్​పై వ్యాఖ్యలు చేసిన దాసోజు శ్రవణ్​

సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లకు నిరుద్యోగుల శాపం తగులుతుందని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ విమర్శించారు. ప్రభుత్వ నోటిఫికేషన్లు రావడం లేదని ఆత్మహత్యాయత్నం చేసుకున్న సునీల్​ను ఆయన నిమ్స్​ ఆస్పత్రిలో పరామర్శించారు. ఆత్మహత్యలతో ఉద్యోగాలు రావని... ప్రాణాలతో ఉంటూ కేసీఆర్‌తో పోరాడి సాధించుకుందామని శ్రవణ్​ కోరారు.

dasoju sravan latest news, dasoju sravan comments on kcr ktr
'కేసీఆర్‌,కేటీఆర్‌లకు నిరుద్యోగుల శాపం తగులుతుంది'
author img

By

Published : Mar 30, 2021, 9:04 PM IST

సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు నిరుద్యోగుల శాపం తగులుతుందని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ ఆరోపించారు. ఆత్మహత్యలతో ఉద్యోగాలు రావని... ప్రాణాలతో ఉంటూ కేసీఆర్‌తో పోరాడి సాధించుకుందామని దాసోజు సూచించారు.

ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు చేయడం లేదని మానసిక క్షోభకు గురై ఆత్మహత్యయత్నానికి పాల్పడి.. నిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సునీల్‌ను ఆయన పరామర్శించారు. పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవడం ఆందోళనకరమని తెలిపారు. సునీల్‌కు జరగరానిది జరిగితే అది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే అవుతుందన్నారు.

ఇదీ చూడండి : '140 ఎకరాల వివాదాస్పద భూమి ప్రభుత్వానిది కాదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.