ETV Bharat / state

KC Venugopal Meet with Parliament Abservers : 'వ్యూహాత్మకంగా ముందుకెళ్తేనే అధికారం చేజిక్కుంచుకోగలం' - KC Venugopal meet with Parliament observers

KC Venugopal Meet with Parliament Abservers : తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వ్యూహాత్మకంగా ముందుకెళ్తేనే అధికారం కైవసం అవుతుందని ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అభిప్రాయపడ్డారు. 17 పార్లమెంట్ నియోజక వర్గాల పరిశీలకులతో వేణుగోపాల్ గాంధీ భవన్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితుల గురించి ఆరా తీశారు. పార్టీ బలోపేతంపై నాయకులకు దిశానిర్దేశం చేశారు.

Congress focus on Telangana assembly elections
KC Venugopal Telangana Tour
author img

By

Published : Aug 5, 2023, 6:13 PM IST

Congress focus on Telangana assembly elections 2023 : తెలంగాణలో శాసన సభ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్‌ దూకుడు పెంచింది. ఈ క్రమంలో కొత్త రాజకీయ నాయకుల చేరికలు, అసమ్మతి నాయకుల బుజ్జగింపు ప్రక్రియలు మొదలుపెట్టిన హస్తం పార్టీ.. ఇప్పుడు పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలో ఆ పార్టీ అగ్ర నాయకులు తెలంగాణపై ఫోకస్‌ చేశారు. ఈసారి ఎలాగైనా హస్తం జెండా ఎగుర వేయాలని ధృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నారు.

ఈ నేపథ్యంలో ఏఐసీసీ ఆర్గనైసింగ్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ రాష్ట్ర నాయకులతో సమావేశమయ్యారు. 17 పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకులతో గాంధీ భవన్‌లో ఆయన సమావేశమయ్యారు. ఎన్నికల్లో వ్యుహాత్మకంగా వెళ్తేనే రాష్ట్రంలో అధికారం కైవసం చేసుకోవచ్చునని అభిప్రాయపడ్డారు. ఇప్పటి నుంచి ఎన్నికలు పూర్తయ్యే వరకు పూర్తి స్థాయిలో నాయకులు పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని వేణుగోపాల్ సూచించారు. నాయకులను సమన్వయం చేసుకొని వెళ్లినప్పుడే.. క్షేత్ర స్థాయిలో పార్టీ మరింత బలపేతం అవుతుందని తెలిపారు.

Congress Latest News : కారు స్పీడ్​కు బ్రేక్ వేసేందుకు కాంగ్రెస్ కసరత్తు

KC Venugopal meet with Parliament observers : కర్ణాటకలో అమలు చేసిన విధానాన్నే తెలంగాణలోనూ అమలు చేస్తున్నట్లు కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు. ప్రతీ నియోజకవర్గంలో టికెట్‌ ఆశిస్తోన్న వారితో సంబంధం లేకుండా.. ఎన్నికల అబ్జర్వర్లు నేతల మధ్య సమన్వయం చేయాలని ఆదేశించారు. బీఆర్ఎస్‌ను సింగిల్ ఎజెండాతో ఎదుర్కోవాలని నేతలకు సూచించారు. బీఆర్ఎస్ వ్యతిరేకం, కాంగ్రెస్ అనుకూల అంశాలను ఏజెండా ఖరారు చేసుకునేందుకు పీఏసీలో చర్చించాలని తెలిపారు. పార్టీ నియమావళిని ఉల్లంఘిస్తే.. నేతలకు కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

TS Congress Leaders Meet Governor : 'వరద బాధితులను ఆదుకోండి' గవర్నర్​కు కాంగ్రెస్​ బృందం విజ్ఞప్తి

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏఐసీసీ ఇంఛార్జీ మాణిక్‌రావ్‌ ఠాక్రే, రాష్ట్ర ఎన్నికల పరిశీలకురాలు దీప దాస్ మూన్షీ, ఏఐసీసీ కార్యదర్శులు శ్రీధర్ బాబు, రోహిత్ చౌదరీ, విశ్వనాత్, మన్సూర్ అలీ ఖాన్, వంశీ చంద్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సంపత్ కుమార్, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ, ఎన్నికల మెనేజ్మెంట్‌ కమిటీ ఛైర్మన్ దామోదర్ రాజా నర్సింహ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన పార్లమెంట్ పరిశీలకులు పాల్గొన్నారు.

Telangana Assembly Sessions 2023 : మరోవైపు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలనుసైతం కాంగ్రెస్‌ అవకాశంగా మార్చుకుంటోంది. ఇటీవల సంభవించిన వరద నష్టంపై సభలోనే పరిహారం ప్రకటించాలని అధికార బీఆర్‌ఎస్‌ను డిమాండ్‌ చేసింది. అలాగే విద్య, వైద్యంపై ఈ తొమ్మిదేళ్లో ఎంత మొత్తం ఖర్చు చేశారో చెప్పాలని ప్రశ్నించింది. దీనిపై శుక్లవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో వాడీవేడిగా చర్చ నడిచింది.

Congress Delegation Letter to CS : 'భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన రైతులు, బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి'

Congress leaders protest : 'వరద బాధితులకు పరిహారం చెల్లించాల్సిందే'

Telangana Assembly on Floods Damage : అసెంబ్లీని కుదిపేసిన 'వరద'.. పరిహారం ప్రకటించాలని విపక్షాల పట్టు.. సీఎం లేరని కాంగ్రెస్ వాకౌట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.