Kavya Excels in Modeling and KuchiPudi Dance in Hyderabad : తల్లిదండ్రుల కలల్ని తీర్చేందుకు కృషి చేసే పిల్లల్ని తరుచూ చూస్తూనే ఉంటాము. ఈ యువతి కూడా ఆ కోవకు చెందిందే. నాట్యంలో అదరగొడుతున్న ఈ యువతి మోడల్(Fashion Model Kavya Story) గానూ ప్రతిభ కనబరుస్తూ సత్తా చాటుకుంటోంది. మనకంటూ ప్రత్యేక గుర్తింపు లభించాలంటే అందరి కంటే భిన్నంగా టాలెంట్‌ను ప్రదర్శించాలని యువతి చెబుతోంది. కూచిపూడి నాట్యం చేస్తోన్న ఈ యువతి పేరు కావ్య(Kavya Kuchipudi Dancer). హైదరాబాద్‌లోని చింతల్ ఈమె స్వస్థలం. చిన్నప్పటి నుంచి కూచిపూడి నాట్యం అంటే కావ్యకు ఇష్టం. ఈ క్రమంలోనే తల్లిదండ్రులు కూడా కుమార్తె ఇష్టాన్ని ప్రోత్సహించడం, అందులో కావ్య క్రమంగా ఎదగడం చకచకా జరిగిపోయాయి.
కూచిపూడిలో రాణిస్తున్న సమయంలోనే అనుకోకుండా మోడలింగ్ అవకాశం కావ్య తలుపుతట్టింది. అందివచ్చిన అవకాశాన్ని విడవద్దని నిర్ణయించుకుంది. కూచిపూడిలో రాణిస్తున్న యువతికి మోడలింగ్‌పైనా ఆసక్తి ఉండేది. అందుకు తగ్గట్టుగానే అవకాశం రావడంతో తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ముందడుగేసింది. ఫలితంగా మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరిగిన ఫెలానా ఫ్యాషన్ షోలో మిస్ న్యాచురల్ గోల్డ్ విన్నర్‌గా నిలిచింది.
"నేను ఆరో తరగతి చదువుతున్నప్పుడు నుంచి కూచిపూడి నాట్యం నేర్చుకుంటున్నాను. మా అమ్మ కోరిక కోసం డ్యాన్స్‌ను ఫ్యాషన్‌గా మార్చకున్నాను. ఎన్నో కార్యక్రమాల్లో నాట్యం చేశాను. దేశనలుమూలలు తిరిగాను. చాలా అవార్డులు గెలుచుకున్నాను. మోడలింగ్ పట్ల కూడా మంచి అవగాహన ఉంది. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాను. నాకు ఒక కోరిక ఉంది పేదపిల్లలకు ఆర్థికంగా సాయం చేయాలని ఉంది. నా తల్లిదండ్రుల నుంచి పూర్తి సహకారం ఉంది." - కావ్య, కూచిపూడి నృత్యకారిణి
ఆరోగ్యం కోసం ఆర్గానిక్ వైపు.. యువ జంట కొత్త ఆలోచన
Kuchipudi Dancer Kavya : ఈ యువతి మోడలింగ్‌లో అనూహ్యంగా వచ్చిన అవకాశాన్ని అందుకుని మంచి కెరీర్ నిర్మించుకుంటోంది. తను మరింత విజయవంతమైన తర్వాత డాన్స్ స్కూల్ ఏర్పాటుతో పాటు తన భవిష్యత్ ప్రణాళిక గురించి కూడా కావ్య చెప్పింది. తను ఏ రంగంలో ఉన్నా తల్లిదండ్రులు అనునిత్యం ప్రోత్సహిస్తున్నారని చెప్పింది. ప్రతీ ప్రోగ్రాంకు వస్తూ తనకు వెన్నుదన్నుగా నిలుస్తన్నారని యువతి వాపోయింది.
"చిన్నప్పటి నుంచి డ్యాన్సర్, మోడల్ కావాలని తన చిన్నప్పటి డ్రీమ్. నా భార్యకు కూడా ఒక డ్యాన్సర్ అవ్వాలని కోరిక ఉండేది. నా బిడ్డను నేను ప్రోత్సహించుకుంటూ వస్తున్నాను. ఎవరి మీద ఆధారపడకుండా.. తన కాళ్లపై తాను నిలబడితే చాలు మాకు. తను ఈ విషయంలో ఏం చేసిన తల్లిదండ్రులుగా పూర్తి సహకారం అందిస్తాము." -కావ్య తల్లిదండ్రులు
తమ కుమార్తె స్వశక్తితో ఎదగడమే తమకు సంతోషంగా ఉందని కావ్య తల్లిదండ్రులు హర్షించారు. చదువుకుంటూనే నాట్యం, మోడలింగ్ రంగంలో రాణిస్తూ బహుముఖ ప్రజ్ఞను కనబరుస్తోందని చెప్పారు. వ్యక్తిలో ఉండే అద్వితీయ ప్రతిభను తల్లిదండ్రులు గుర్తించగలగాలని అన్నారు. పాఠశాల స్థాయి నుంచే వారికి ఆసక్తి ఉన్న రంగంలో ప్రోత్సహిస్తే.. కచ్చితంగా వారి జీవితం బంగారుమయం అవుతుందని కావ్య అంటుంది.
Srikanth Talent: ఈ తరం కోసం.. నాట్యం చేస్తూ కొండలు ఎక్కుతున్న శ్రీకాంత్