ETV Bharat / state

MLC Kasireddy Narayan Reddy Resigned From BRS : బీఆర్​ఎస్​కు రాజీనామా చేసిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి.. త్వరలోనే కాంగ్రెస్​లోకి.. - Kasireddy Narayana Reddy Resigned From BRS

Kasireddy Narayana Reddy
Kasireddy Narayana Reddy Resigned From BRS
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 1, 2023, 11:44 AM IST

Updated : Oct 1, 2023, 12:52 PM IST

11:37 October 01

MLC Kasireddy Narayan Reddy Resigned From BRS : బీఆర్​ఎస్​కు రాజీనామా చేసిన ఎమ్మెల్సీ కసిరెడ్డి, కల్వకుర్తి జిల్లా పరిషత్తు వైస్‌ ఛైర్మన్​ బాలాజీ సింగ్‌

MLC Kasireddy Narayan Reddy Resigned From BRS : ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, కల్వకుర్తి జిల్లా పరిషత్ వైస్‌ ఛైర్మన్ టి.బాలాజీ సింగ్‌లు బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్(CM KCR)​కు వారిద్దరు రాజీనామా లేఖ(Two leaders resigned from BRS)లను పంపించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష, అభ్యున్నతి కోసం అన్ని త్యాగాలు చేసి, విదేశాలను వదిలి 2009 నుంచి 2014 వరకు కల్వకుర్తి నియోజకవర్గ ఇంఛార్జీగా పార్టీ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నానన్నారు.

తెలంగాణ సాధనలో కీలక భూమిక పోషించాను.. రాష్ట్ర సాధన తరువాత సంక్షేమం పేరిట ప్రజల్లో కుల విభజన జరుగుతున్న తీరు తనకు నచ్చలేదని పేర్కొన్నారు. నియోజకవర్గాల్లో పోలీస్ వ్యవస్థ పూర్తిగా ఎమ్మెల్యేల చేతుల్లో కీలుబొమ్మగా మారిందని ఆరోపించారు. ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఉన్నవారిని అణచివేస్తున్నతీరు తనను బాధించిందని తెలిపారు. సంక్షేమ పథకాల్లో కూడా ఉద్యమకారులకు ప్రాధాన్యం ఇవ్వకుండా ఎమ్మెల్యే అనుచరులకు ఇవ్వడం బాధిస్తున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు.

Tummala Nageswara Rao To Join Congress : కాంగ్రెస్ గూటికి తుమ్మల నాగేశ్వరరావు.. ఆరోజే చేరిక..!

MLC Kasireddy Narayan Reddy Will Join Congress: కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలిసినా సోనియా గాంధీ ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని కసిరెడ్డి పేర్కొన్నారు. ఆమెపై అభిమానంతో తెలంగాణలో ప్రజాస్వామ్య, ప్రజా సంక్షేమ ప్రభుత్వం ఏర్పడాలన్న ఆకాంక్షతో కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. ఇవాళ ఉదయం పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిని వీరిద్దరు కలిశారు. పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ కలిసి జూబ్లిహిల్స్‌లోని రేవంత్‌ నివాసంలో భేటీ అయ్యారు. చర్చించిన తరువాత రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

Kantha Reddy Tirupati Reddy Resigned Medak District Congress President : మెదక్‌ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి కంఠారెడ్డి తిరుపతి రెడ్డి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ కోసం సుమారు పది సంవత్సరాలుగా పార్టీ పటిష్టతకు కోసం పని చేసిన తనలాంటి కార్యకర్తలకు ఈ పార్టీలో స్థానం లేదన్న విషయం అర్థమైందని లేఖలో పేర్కొన్నారు. ఇటీవల పార్టీలో వరుసగా జరుగుతున్న పరిణామాలు చూస్తే ఎవరికైనా అర్థమవుతుందని ఆయన వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం చేసిన త్యాగాలు, పడ్డ కష్టాలు గుర్తించకుండా, కేవలం డబ్బు సంచులే ప్రాతిపదికగా జరుగుతున్న పార్టీ టికెట్ల కేటాయింపులపై ప్రతినిత్యం వస్తున్న ఆరోపణలు, వాటి పరిణామాలను చూసి తాను తీవ్రమైన మనోవేదనకు లోనయ్యానని వివరించారు. నిఖార్సైన కాంగ్రెస్ కార్యకర్తగా ఇలాంటి పరిణామాలను జీర్ణించుకొనలేక, చూస్తూ పార్టీలో ఉండలేక, బరువెక్కిన గుండెతో కాంగ్రెస్ పార్టీని వీడటం తప్ప మరో మార్గం కనిపించడం లేదని తెలిపారు. వీటి అన్నింటిని దృష్టిలో ఉంచుకుని మనోవేధనతో మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి, కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.

Mynampally Hanumantha Rao joined Congress Party : కాంగ్రెస్​ తీర్థం పుచ్చుకున్న మైనంపల్లి.. పార్టీ కండువా కప్పిన ఖర్గే

BRS leader Srihari Rao joined Congress : 'నిర్మల్' ​పై కాంగ్రెస్ ఫోకస్​.. పార్టీలోకి మరో బీఆర్​ఎస్​ నాయకుడు

Last Updated : Oct 1, 2023, 12:52 PM IST

For All Latest Updates

TAGGED:

kasireddy
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.