Kartikamasa Festival in Qatar: ఖతార్లో తెలుగువారు మరోసారి ఒక్కటయ్యారు. కార్తిక మాసం సందర్భంగా తెలుగువారంతా వనభోజనానికి హాజరయ్యారు. చిన్నాపెద్దా అంతా కలిసి హాజరైన ఈ వేడుకకు సుమారు 450 మంది హాజరయ్యారు. ఎండ, సమయాభావాన్ని కూడా లెక్కచెయ్యకుండా విచ్చేసిన పిల్లాపెద్దలందరూ.. కార్యక్రమాన్ని ఆనందించారని నిర్వాహకులు ఆంధ్రకళా వేదిక అధ్యక్షులు శ్రీ వెంకప్ప భాగవతుల తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఇంత భారీగా నిర్వహించుకోటానికి సహకరించిన ప్రాయోజితలకు సహకరించిన స్వచ్ఛంద సేవకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
వేడుకలో పలువురు తెలుగు ప్రముఖులు, ఇండియన్ కల్చరల్ సెంటర్ ఐసీసీ జనరల్ సెక్రటరీ కృష్ణకుమార్, ఇండియన్ కమ్యూనిటీ బెనివలెంట్ ఫోరమ్ ఐసీబీఎఫ్ నుంచి రజనిమూర్తి , తెలంగాణ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఖాజా నిజాముద్దీన్, తెలుగు బిజినెస్ అసోసియేషన్ అధ్యక్షులు లూత్పి , సత్యనారాయణ, మలిరెడ్డి, గొట్టిపాటి రమణ , హరీష్ రెడ్డి , తెలంగాణ గల్ఫ్ సమితి కార్యవర్గ సభ్యులు హాజరై మన తెలుగు సంస్కృతి సంప్రదాయాలను పెంపొందించే ఇలాంటి కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించినందుకు ఆంధ్రకళావేదిక కార్యవర్గ బృందాన్ని అభినందించారు.
కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన తంబోలా, టగ్ అఫ్ వార్, ట్రేష్యర్ హంట్, ఒక్క నిమిషం తెలుగులో మాట్లాడటం వంటి పోటీల్లో గెలిచిన విజేతలకు బహుమతులు అందజేశారు. లక్కీడ్రాలో గెలిచిన మొదటి ముగ్గురికి బంగారు నాణేలు అందించారు. చివర్లో ఉసిరి చెట్టు కొమ్మల కింద రుచికరమైన సంప్రదాయ విందు భోజనం, మసాలా మజ్జిగ ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి. కార్యక్రమాన్ని సమర్ధవంతంగా నిర్వహించిన కార్యవర్గ సభ్యులు విక్రమ్ సుఖవాసి, కేటిరావు, వీబీకే మూర్తి, శిరీషా రామ్, సాయి రమేష్, సోమరాజు, రవీంద్రకు.. వెంకప్ప భాగవతుల హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.
ఇవీ చదవండి: