కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రతినిధుల బృదం సందర్శించింది. గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్వైన్ ఫ్లూ, కరోనా వార్డులను సందర్శించారు. వార్డుల్లో ఏర్పాట్లను పరిశీలించారు. ఇంకా కొన్ని ఏర్పాట్లు చేయాలని నోడల్ అధికారికి సూచించారు. జనరల్ వార్డు, ల్యాబ్‌ను సందర్శించారు.
అనుమానితులు వస్తే ఎలాంటి జాగ్రత్తలు, చికిత్సలు అందించాలనే విషయాల గురించి వైద్యులకు సూచనలు చేశారు. వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కోరారు.
ఇవీ చూడండి: 'రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్లో గళమెత్తండి'