రాష్ట్ర కాంగ్రెస్ నేతలు విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్ ఆరోపించారు. అధికారిక కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి... కనీస మర్యాద లేకుండా మాట్లాడటం.. వ్యక్తిగత దూషణలకు దిగడం దురదృష్టకరమన్నారు. ఉత్తమ్‌కు ఇంటి పోరెక్కువై ఇష్టమెచ్చినట్లు మాట్లాడుతున్నారని.. ఆయన తీరును కాంగ్రెస్ కార్యకర్తలే అసహ్యించుకుంటున్నారని అన్నారు.
ఉత్తమ్, రేవంత్ రెడ్డి ఆరేళ్లుగా తప్పుడు ఆరోపణలు చేస్తూనే ఉన్నారని కర్నె ప్రభాకర్ విమర్శించారు. అమరవీరుల గురించి రేవంత్ మాట్లాడటం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఎక్కడ ధాన్యం కొనుగోళ్లు జరగడం లేదో నిరూపించాలన్న ఆయన.. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరానికి 15 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేసిందన్నారు. రాయలసీమకు నీరు తరలిస్తుంటే 2005 ముందు హారతులు పట్టి చూసిందెవరో అందరికీ తెలుసన్నారు. 203 జీవోకు, ఏపీ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా తెరాస పోరాటం ఆగదని కర్నె ప్రభాకర్ పేర్కొన్నారు.
ఇవీ చూడండి: లెక్కలు అడిగితే మంత్రికి కోపం వస్తోంది: ఉత్తమ్