ETV Bharat / state

తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే - మేం ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేస్తాం: సిద్ధరామయ్య - తెలంగాణలో సిద్ధరామయ్య ఎన్నికల ప్రచారం

Karnataka CM Siddaramaiah on Telangana Elections 2023 : తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే కాంగ్రెస్‌ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేస్తామని స్పష్టం చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ హమీలు అమలవ్వలేదని అసత్యాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌, కేటీఆర్‌, బీజేపీ చేస్తున్న ప్రచారం అబద్ధమని ప్రజలు దీనిని తిప్పికొట్టాలన్నారు.

Karnataka CM Siddaramaiah on Telangana Elections 2023
Karnataka CM Siddaramaiah
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 26, 2023, 4:02 PM IST

Updated : Nov 26, 2023, 10:50 PM IST

తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే - మేం ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేస్తాం: సిద్ధరామయ్య

Karnataka CM Siddaramaiah on Telangana Elections 2023 : ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల క్రతువు ముగియటంతో.. కాంగ్రెస్‌(Telangana Congress) జాతీయ నాయకత్వాన్ని రాష్ట్రంలో మోహరించింది. ఆకట్టుకునే హామీలు, అధికార పార్టీని ఢీకొట్టే ఎత్తులతో దూకుడుగా వ్యవహరిస్తున్న ఆ పార్టీ .. మిగిలిన రెండు రోజులు పూర్తిగా ప్రచారంపైనే దృష్టి సారించింది. హస్తం అగ్రనేతలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన నాయకులు, రాష్ట్ర నేతలు తీరిక లేకుండా నియోజకవర్గాల్లో పర్యటిస్తూ.. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు.

Siddaramaiah Comments on BRS and BJP : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తీరుతుందని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య(Karnataka CM Siddaramaiah) ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటకలో సమస్య ఉంటే రైతులు హైదరబాద్​లో ఆందోళన చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. కర్ణాటక రైతుల పేరుపై తెలంగాణలో నిరసన చేసేవాళ్లు కర్ణాటక రైతులు కాదని స్పష్టం చేశారు. కేసీఆర్​కి కర్ణాటక రమ్మని ఓపెన్ ఛాలెంజ్ చేశానని.. కానీ ఆయన రాలేదని చెప్పారు. ఈరోజు కూడా కేసీఆర్​ని కర్ణాటక రమ్మని ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. కేసీఆర్ కర్ణాటక వచ్చి అక్కడి ప్రభుత్వ పాలన చూడాలని సూచించారు.

Siddaramaiah on Telangana Congress Six Guarantees : బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నాయకులు కర్ణాటక రావాల్సిందిగా కోరుతున్నామని సిద్ధరామయ్య తెలిపారు. తెలంగాణలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు తప్పకుండా అమలు అవుతాయని పేర్కొన్నారు. కర్ణాటకలో తాము ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయడం లేదని.. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్, బీజేపీ నాయకులు చేస్తున్న ప్రచారం అబద్ధమని ప్రజలు మోసపోవద్దని సూచించారు. గ్యారెంటీ స్కీమ్​ల అమలు కోసం వారు ప్రమాణస్వీకారం చేసిన రోజే కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు.

కేసీఆర్​ను ఓడించి - పర్మినెంట్​గా ఫాంహౌస్​కు పంపించాలి : డీకే శివకుమార్

కర్ణాటకలో మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తున్నారని సిద్ధరామయ్య పేర్కొన్నారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చే సరికి కేసీఆర్ అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే నాలుగు గ్యారెంటీ పథకాలు అమలవుతున్నాయని వెల్లడించారు. ఇంకో గ్యారెంటీ పథకం జనవరిలో మొదలు పెడతామని చెప్పారు. గ్యారెంటీ పథకాలకు బడ్జెట్ కేటాయించేశామని.. నిధుల కొరత కూడా లేదని వివరించారు. మొత్తం రూ.38 వేల కోట్లు బడ్జెట్ కూడా కేటాయించామన్నారు. కర్ణాటకలో తమకంటే ముందున్న బీజేపీ 600 హామీలు ఇచ్చి, కనీసం 10 శాతం కూడా అమలు చేయలేకపోయిందని సిద్ధరామయ్య ఆరోపించారు.

'కర్ణాటకలో సమస్య ఉంటే రైతులు తెలంగాణలో ఆందోళన చేస్తారా?. తెలంగాణలో నిరసన చేసేవాళ్లు కర్ణాటక రైతులు కాదు. కర్ణాటక వచ్చి కేసీఆర్‌ కాంగ్రెస్‌ పాలన చూడాలి. తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే. కాంగ్రెస్‌ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేస్తాం. కర్ణాటకలో కాంగ్రెస్‌ హమీలు అమలవ్వలేదని అసత్యాలు చెబుతున్నారు. కేసీఆర్‌, కేటీఆర్‌, బీజేపీ చేస్తున్న ప్రచారం అబద్ధం.' -సిద్ధరామయ్య, కర్ణాటక సీఎం

Siddaramaiah Fires on PM Modi : కర్ణాటకలో ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేయలేరని ప్రధాని మోదీ అన్నారని సిద్ధరామయ్య గుర్తుచేశారు. బిల్డర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నామని కేటీఆర్ చేస్తున్న ప్రచారం అబద్ధమని.. తప్పుడు ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టాలనన్నారు. అలాగే యాడ్యురప్ప కూడా అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కర్ణాటకలో గత బీజేపీ ప్రభుత్వం 40 శాతం కమిషన్ తీసుకుందని కాంట్రాక్టర్ అసోసియేషన్ ఆరోపించిందని సీఎం సిద్ధరామయ్య వెల్లడించారు.

రాష్ట్రంలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్న కాంగ్రెస్​ - రంగంలోకి దిగుతున్న అగ్రనేతలు

రైతుబంధుకు అనుమతి తెచ్చిన సీఎం- దళిత బంధుకు ఎందుకు తేలేదు : రేవంత్ రెడ్డి

Last Updated : Nov 26, 2023, 10:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.