ETV Bharat / state

వరద బాధితులకు కారెం రవీందర్​ రెడ్డి ఆర్థిక సాయం - వరద బాధితులకు కారెం రవీందర్​ రెడ్డి ఆర్థిక సాయం

హైదరాబాద్​లోని వరద బాధితుల కోసం సీఎం సహాయనిధికి టీఎన్జీవో కేంద్ర సంఘం మాజీ అధ్యక్షుడు కారెం రవీందర్​ రెడ్డి తన ఒక నెల పెన్షన్​ అందజేశారు. అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి రాయికంటి ప్రతాప్ ద్వారా చెక్కుని అందించారు. వారం రోజులుగా కురుస్తోన్న వర్షాలతో నగరంలో జనజీవనం అతలాకుతలమైందనీ, ఇప్పటికీ కొన్ని ఇళ్లు వరద నీటిలోనే చిక్కుకుపోయాయని రాజేందర్​ ఆవేదన వ్యక్తం చేశారు.

karem ravinder reddy donation to cm relief fund
వరద బాధితులకు కారెం రవీందర్​ రెడ్డి ఆర్థిక సాయం
author img

By

Published : Oct 22, 2020, 2:50 PM IST

హైదరాబాద్​ వరద బాధితుల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి టీఎన్జీవో కేంద్ర సంఘం మాజీ అధ్యక్షుడు కారెం రవీందర్ రెడ్డి ఒక నెల పెన్షన్​ రూ. 33,650 అందజేశారు. వారం రోజులుగా నగరంలో కురుస్తోన్న వానలకు జన జీవనం అతలాకుతలమైందనీ, గ్రేటర్ హైదరాబాద్​ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని నూతన అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ అన్నారు. టీఎన్జీవో రహదారులు, భవనాల శాఖ యూనిట్ ఆధ్వర్యంలో కారం రవీందర్ రెడ్డి, రాజేందర్, ప్రధాన కార్యదర్శి రాయికంటి ప్రతాప్​ లను హైదరాబాద్​లో ఘనంగా సన్మానించారు.

వర్షాల వల్ల నష్టపోయిన కుటుంబాలను ఆదుకోవడానికి సహాయక చర్యల కోసం సీఎం కేసీఆర్ రూ. 550 కోట్లు విడుదల చేయడం ద్వారా ఆ కుటుంబాలకు సహాయం అందిందని రాజేందర్​ పేర్కొన్నారు. వరద బాధితులను ఆదుకోవడానికి సమాజంలోని పెద్దలు స్పందించి సహాయం అందించాలని​ కోరారు.

రోడ్లు, భవనాల శాఖలో పునర్నిర్మాణ చర్యల్లో భాగంగా ఎన్టీపీఏ పోస్టులకు త్వరలో ముఖ్యమంత్రి ఆమోదంతో ప్రమోషన్లు ఇప్పిస్తామని రాజేందర్ చెప్పారు. ఉద్యోగుల సమస్యలపై త్వరలో ఆయనని కలుస్తామని అన్నారు.

ఇదీ చదవండి: 'ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.