Kantivelugu program in Assembly lobby: తెలంగాణ అసెంబ్లీ లాబీలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమాన్ని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు ఎర్రబెల్లి, ప్రశాంత్ రెడ్డి కంటి పరీక్షలను చేయించుకున్నారు. కంటి పరీక్షలో స్పీకర్ పోచారం కంటిచూపు సరిగానే ఉందని వైద్యులు పేర్కొనగా.. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి ప్రశాంత్ రెడ్డికి ఆఖరి లైన్ కనిపించలేదని గుర్తించారు.
దీంతో 'కంటి చూపులో నీనే మీ కంటే యంగ్‌గా ఉన్నా అంటూ పోచారం.. ప్రశాంత్ రెడ్డితో సరదా వ్యాఖ్యానించారు'. కార్యక్రమంలో మాట్లాడిన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి.. కంటి వెలుగును దేశంలోనే గొప్ప కార్యక్రమంగా పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులు సైతం ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. మరోవైపు అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు స్టాల్ల వద్దకు ఎంఐఎం శాసన సభ్యులు అక్బరుద్దీన్, పాషా ఖాద్రి, ముంతాజ్ ఖాన్‌లను ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు దగ్గరుండి తీసుకొచ్చారు. అనంతరం వారికి కంటీ పరీక్షలు చేయించి.. పథకం ప్రాముఖ్యతను వివరించారు.
"ఇప్పటి వరకూ 27లక్షల మంది కంటి వెలుగు రెండో విడత కార్యక్రమంలో భాగంగా పరీక్షలు చేయించుకున్నారు. 5లక్షల మంది కంటి అద్దాలను తీసుకున్నారు. వీటితో పాటుగా మరో 4లక్షల అద్దాలను ప్రభుత్వం ఇవ్వడానికి సిద్దంగా ఉంది. ఆ అద్దాలు వచ్చిన తరువాత లబ్దిదారులకు నేరుగా వాళ్ల ఇంటి వద్దకే తీసుకొని వెళ్లి ఇస్తాం. దేశానికి ఆదర్శవంతమైన పథకం కంటివెలుగు. దీనిని అందరూ సద్వినియోగపరుచుకోండి."- పోచారం శ్రీనివాస రెడ్డి, శాసన సభ స్పీకర్
MIM leaders at Kantivelu program: కార్యక్రమంలో మాట్లాడిన ఎంఐఎం శాసన సభ సభ్యులు ఈ పథకం ద్వారా ఎంతో మంది పేద ప్రజలకు లబ్ది చేకూరుతోందని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కంటి వెలుగు కార్యక్రమం అద్భుతమని కొనియాడారు. శాసన సభ ఆవరణలో కంటి వెలుగు కార్యక్రమంను ఏర్పాటు చేసినందుకు సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావుకు వారు ప్రత్యేక అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో వీరితో పాటు మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకరరావు, సహా మంత్రులు, అధికారులు పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్నారు.
"దేశంలోనే ఇది ఒక మంచి కార్యక్రమం.. దీనిని అన్ని రాష్ట్రాలు ఆచరిస్తున్నాయి. మంత్రి హరీశ్ రావు స్వయంగా మాకు కంటి పరీక్షలు చేయించారు. దీనిని అందరూ సద్వినియోగ పరుచుకోవాలి. ఇంత మంచి కార్యక్రమం అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేయడం చాలా అభినందించాలి. సీఎం కేసీఆర్, హరీశ్‌రావు, డాక్టర్లు, అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు"- గుత్తా సుఖేందర్ రెడ్డి, మండలి ఛైర్మన్
ఇవీ చదవండి: