ETV Bharat / state

జీహెచ్​ఎంసీకి 60 కోట్ల భూమి విరాళం - 60 crore land donation to GHMC

తెరాస ప్రభుత్వం ప్రజలకోసమే పని చేస్తుందని మంత్రి తలసాని పేర్కొన్నారు. కళ్యాణ్​నగర్​ కాలనీ అసోసియేషన్​ సభ్యులు జీహెచ్​ఎంసీకి 60 కోట్ల విలువ చేసే భూమిని విరాళంగా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్​తో కలిసి ఆయన హాజరయ్యారు.

kalyan nagar colony people 60 crore land donation to GHMC hyderabad
జీహెచ్​ఎంసీకి 60 కోట్ల భూమి విరాళం
author img

By

Published : Feb 16, 2020, 1:27 PM IST

హైదరాబాద్ నగరంలోనే కాకుండా రాష్ట్రంలోని ప్రతి ఇంటికి మంచినీళ్లు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని పశుసంవర్థక, సినిమాటోగ్రఫీశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ అన్నారు. తెరాస ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తుందని మంత్రి పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని వెంగళ్‌రావునగర్‌లో ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, మంత్రి తలసాని ఆధ్వర్యంలో స్థానిక 'కళ్యాణ్‌నగర్ వెంచర్‌ అసోషియేషన్‌' సభ్యులు రూ.60కోట్ల విలువైన నాలుగువేల గజాల స్థలాన్ని జీహెచ్‌ఎంసీకి బహుమానంగా అందజేశారు.

ఈ స్థలంలో కళ్యాణ్‌నగర్‌ కాలనీవాసులకు అన్ని హంగులతో కూడిన పార్కును ఏర్పాటు చేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులను కోరారు. కళ్యాణ్ నగర్ కాలనీలో సమస్యలుంటే స్థానిక ఎమ్మెల్యే గోపినాథ్‌కు తెలపాలని మంత్రి సూచించారు. నగరంలో పార్కులను సుందరీకరణగా అభివృద్ధి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్, జోనల్ కమిషనర్ రవి కిరణ్ తదితరులు హాజరయ్యారు.

జీహెచ్​ఎంసీకి 60 కోట్ల భూమి విరాళం

ఇదీ చూడండి : నెక్లెస్​రోడ్​లో ఉత్సాహంగా 10కె రన్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.