ETV Bharat / state

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: కల్వకుంట్ల హిమాన్షు

'భూమిని కాపాడితే.. అది మనల్ని కాపాడుతుంది.. కానీ నాశనం చేయాలని చూస్తే.. అదీ మనల్ని నాశనం చేస్తుంది.' అని చెబుతున్నారు మంత్రి కేటీఆర్​ తనయుడు హిమాన్షు. భూమిపై మనం చేసే ప్రతి పనికీ మనం జవాబుదారీతనంగా ఉండాలని అంటున్నారు. వాతావరణ కాలుష్య నియంత్రణ, మార్పులు, పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవాలో తనదైన శైలిలో తన యూట్యూబ్​ ఛానల్​ ద్వారా ప్రెజెంటేషన్​ ఇచ్చారు.

himanshu presentation on environmental sustainability
పర్యావరణ పరిరక్షణపై హిమాన్షు ప్రెజెంటేషన్​
author img

By

Published : May 21, 2021, 8:06 PM IST

పర్యావరణ పరిరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరిదీ అని మంత్రి కేటీఆర్​ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు సూచించారు. అందుకు మనం కొన్ని పద్ధతులను ఆచరించాలని చెప్పారు. మనిషి భూమిపై చేసే కార్యకలాపాల ఆధారంగానే వాతావరణ మార్పులు జరుగుతాయని వెల్లడించారు. 1850 తర్వాత దేశంలో పరిశ్రమలు, అటవీ నిర్మూలనతో వాతావరణంలో కార్బన్​ డై ఆక్సైడ్​ ఉద్గారాలు పెరుగుతూ వచ్చాయని చెప్పారు. క్రమక్రమంగా భూమి వేడెక్కిపోతూ ప్రమాదకర స్థాయికి చేరుకుందని వివరించారు. కొన్ని ప్రాంతాల్లో వర్షపాతం తగ్గడానికి ఇది సాక్ష్యంగా నిలుస్తోందని.. వరదలు, భూకంపాలు అధికమయ్యాయని చెప్పుకొచ్చారు. వాతావరణంలో అధిక ఉష్ణోగ్రతతో సముద్రాలు వేడెక్కడంతో పాటు మంచు కొండలు కరిగి సముద్ర మట్టం పెరుగుతోందని అన్నారు.

  • Short speech on Climate change, and environmental sustainability Premiers at 12:30pm (IST) Please checkout the video. like and subscribe if you find it informative, comment your thoughts and opinions and share the video to create more awareness. Thank you!https://t.co/njjfpaiL0L

    — Himanshu Rao Kalvakuntla (@TheRealHimanshu) May 20, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మూల్యం చెల్లించుకోవాలి

ఈ మార్పును మనం అర్థం చేసుకోకపోతే చాలా విపత్కర పరిస్థితులు ఎదుర్కొని మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హిమాన్షు పేర్కొన్నారు. మనకున్న సహజవనరులను పరిరక్షించుకుంటూ భవిష్యత్తు తరాలకు వాటిని అలాగే అందించాలని చెప్పారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ ముఖ్య భూమిక పోషించాలని.. మనం చేసే ప్రతి పనికీ జవాబుదారీతనంగా ఉండాలని ఉద్ఘాటించారు.

కొన్ని పాలసీలు

ఇందుకోసం మనం కొన్ని విధివిధానాలను రూపొందించుకోవాలని కేటీఆర్​ తనయుడు సూచించారు. బాధ్యతారాహిత్యంగా ఉన్న వారికి క్లైమేట్​ టాక్స్​ వేయాలని.. సొంత వాహనాలు కాకుండా ప్రభుత్వ రవాణాను వినియోగించుకుంటే వాతావరణ కాలుష్యం తగ్గుతుందని పేర్కొన్నారు. ఎలక్ట్రిక్​ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించాలని చెప్పిన హిమాన్షు.. తెలంగాణలో వీటిని వినియోగంలోకి తేవడం సంతోషంగా ఉందని అన్నారు. సాధారణ జీవనానికి అలవాటుపడుతూ చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించాలని సూచించారు. ఏసీలు, కార్ల వినియోగాన్ని తగ్గించి చెట్లను పెంచితే గాలిలో కార్బన్​ డై ఆక్సైడ్​ లెవెల్స్ తగ్గిపోయి ఆక్సిజన్​ ఉద్గారాలు పెరుగుతాయని అన్నారు. నీటి కొరత ఏర్పడే వరకు నీటి విలువ మనకు తెలియదని.. మన ముందు తరాలకు మనం చేసే ప్రతి పనికీ మనం సమాధానం చెప్పుకోవాలని సూచిస్తూ తన యూట్యూబ్​ ఛానల్​లో ప్రెజెంటేషన్​ విడుదల చేశారు.

ఇదీ చదవండి: 'ఫైజర్​పై నెకొలకొన్న ప్రతిష్టంభనను త్వరగా తొలగించండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.